
Ram Charan : మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ ఇటీవల ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో ఆయన గ్లోబల్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి రామ్ చేసిన డ్యాన్స్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో ‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ‘చిరుత’ సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ ఆ తరువాత వచ్చిన సినిమాలు యావరేజ్ నడిచాయి. దీంతో ఆయనపై కొన్ని విమర్శలు వచ్చాయి. ఈ విమర్శకుల నోళ్లు మూయించేలా రామ్ చరణ్ ఏం చేశాడో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 38వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన గురించి ఆసక్తి విషయాలు బయటకు వస్తున్నాయి. రామ్ చరణ్ మొదటి సినిమా ‘చిరుత’ బంపర్ హిట్టు కొట్టింది. అయితే ఆ తరువాత కొన్న సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో రామ్ చరణ్ ఇక ఇండస్ట్రీలో కొనసాగుతాడా? అని కొందరు ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో డైరెక్టర్ రాజమౌళి రామ్ చరణ్ తో కలిసి ‘మగధీర’ సినిమా తీసి అందరి నోళ్లు మూయించాడు. తనకు యాక్టింగ్ రాదు అన్న వారికి మగధీర సినిమాతో చెంప చెల్లు మనే సమాధానం ఇచ్చాడు.

ఆ తరువాత రామ్ దశ తిరిగింది. ఇప్పటి వరకు ఆయన చేసింది 14 సినిమాలే. కానీ ఒక్కో సినిమా ఒక్కో ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది. ఇటీవల ఆయన నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచ స్థాయికి వెళ్లిన విషయం తెలిసింది. దీంతో రామ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. అయితే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ రాణించలేకపోయినా… ఇప్పుడు వరల్డ్ లెవల్లో ఆయన గురించి మాట్లాడుకోవడం చూస్తే ఆయన స్థాయి ఏంటో అందరూ అర్థం చేసుకోవచ్చు.
సినిమాల్లోనే కాకుండా రామ్ చరణ్ తండ్రితో పాటు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిరంజీవి చేసే బ్లడ్ బ్యాంక్, ఇతర పనులన్నీ రామ్ చూసుకోవడం విశేషం. బాబాయ్ పవన్ కల్యాణ్ ను ఆదర్శంగా తీసుకొని తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. రామ్ చరన్ తండ్రి ఆస్తులపై ఆధారపడకుండా తనకంటూ స్పెషల్ గా ఆస్తులు సంపాదించుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన సొంత ఆస్తుల విలువ రూ.1500 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ప్రతీ ఏడాదికి రూ.200 కోట్ల ఆదాయాన్ని అందుకుంటున్నాడు. ఒక్కో సినిమాకు రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
రామ్ చరన్ ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. సౌత్ డైరెక్టర్ శంకర్ ఆధ్వర్యంలో వచ్చే తన 15వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవికి సంబంధించిన లుక్స్ ఇప్పటికే లీకై సంచలనం సృష్టించాయి. ఇందులో రామ్ చరణ్ లుక్ డిఫరెంట్ గా ఉంది. ఆ తరువాత బుచ్చిబాబు డైరెక్షన్లో 16వ సినిమాకు కమిట్ అయ్యాడు. ఆ తరువాత కొంతమంది డైరెక్టర్లు రామ్ తో సినిమాలు తీసేందుకు క్యూలో ఉన్నారు.