Akhanda Hindi Collections: హిందీ లో డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన ‘అఖండ’..3 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇంతే!

Akhanda Hindi Collections: నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్ ని ‘అఖండ’ కి ముందు ‘అఖండ’ కి తర్వాత అని విభజించవచ్చు.. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో కెరీర్ ముగింపు దశకి వచ్చిన కీలక సమయంలో ‘అఖండ’ చిత్రం బాలయ్య కెరీర్ కి సంజీవని లాగా మారింది.. సుమారు 70 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లోనూ ట్రేడ్ ని విస్మయానికి గురి చేసింది.   ఎందుకంటే ఒక సీనియర్ […]

Written By: Shiva, Updated On : January 24, 2023 10:12 am
Follow us on

Akhanda Hindi Collections: నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్ ని ‘అఖండ’ కి ముందు ‘అఖండ’ కి తర్వాత అని విభజించవచ్చు.. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో కెరీర్ ముగింపు దశకి వచ్చిన కీలక సమయంలో ‘అఖండ’ చిత్రం బాలయ్య కెరీర్ కి సంజీవని లాగా మారింది.. సుమారు 70 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లోనూ ట్రేడ్ ని విస్మయానికి గురి చేసింది.

Akhanda Hindi Collections

 

ఎందుకంటే ఒక సీనియర్ హీరో సినిమాకి అతి తక్కువ టికెట్ రేట్స్ మీద ఈ స్థాయి వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు.. చాలా మంది హీరోలు అత్యధిక టికెట్ రేట్స్ తో వచ్చినా రాబట్టలేని వసూళ్లను ఈ సినిమా అతి తక్కువ టికెట్ రేట్స్ మీద రాబట్టడం ట్రేడ్ ఎప్పటికీ మర్చిపోలేదు.. ఈ సినిమా తర్వాత బాలయ్య మార్కెట్ కూడా బాగా పెరిగిపోయింది.

అంతటి ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాని హిందీలో ఈ నెల 20వ తారీఖున భారీ లెవెల్ లో విడుదల చేసారు.. హిందూ సంప్రదాయానికి అద్దం పట్టేలా ఉన్న ఈ సినిమాకి బాలీవుడ్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతారని అనుకున్నారు మేకర్స్.. బుక్ మై షో లో ప్రత్యేకంగా ప్రొమోషన్స్ కూడా చేసారు.. ఇంత చేసిన తర్వాత కచ్చితంగా ఓపెనింగ్స్ వస్తాయని అందరూ అనుకున్నారు.

.

Akhanda Hindi Collections

కానీ మొదటి మూడు రోజులకు కలిపి ఈ సినిమాకి అక్కడ 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు.. అంటే ప్రింట్ ఖర్చులని కూడా ఈ సినిమా వసూలు చెయ్యలేదు అన్నమాట.. సరైన ప్రొమోషన్స్ చేసి ఉంటే మాత్రం కచ్చితంగా హిందీ క్లిక్ అయ్యేదని.. అఖండ హిందీ వెర్షన్ ఒకటి విడుదల అయ్యిందని కనీసం నందమూరి ఫ్యాన్స్ కి కూడా గట్టిగా తెలియదంటున్నారు విశ్లేషకులు.

Tags