https://oktelugu.com/

Abhishek Bachchan- Aishwarya Rai Divorce: బ్రేకింగ్: భర్త అభిషేక్ కి గుడ్ బై చెప్పిన ఐశ్వర్య… త్వరలో విడాకుల ప్రకటన?

Abhishek Bachchan- Aishwarya Rai Divorce: ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారన్న వార్త బాలీవుడ్ ని కుదిపేస్తోంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా మీడియాలో ఈ మేరకు కథనాలు వెలువడుతున్నాయి. భర్త అభిషేక్ తో ఐశ్వర్య రాయ్ కి విబేధాలు చోటు చేసుకోగా… విడాకులు దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. మూడు రోజుల పాటు ముంబైలో నీతూ ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ […]

Written By:
  • Shiva
  • , Updated On : April 8, 2023 / 05:45 PM IST
    Follow us on

    Abhishek Bachchan- Aishwarya Rai Divorce

    Abhishek Bachchan- Aishwarya Rai Divorce: ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారన్న వార్త బాలీవుడ్ ని కుదిపేస్తోంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా మీడియాలో ఈ మేరకు కథనాలు వెలువడుతున్నాయి. భర్త అభిషేక్ తో ఐశ్వర్య రాయ్ కి విబేధాలు చోటు చేసుకోగా… విడాకులు దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. మూడు రోజుల పాటు ముంబైలో నీతూ ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ ఏర్పాటు చేసిన కార్యక్రమం కావడంతో బాలీవుడ్ మొత్తం తరలివచ్చింది.

    పెళ్ళైన స్టార్స్ జంటలుగా వచ్చారు. ఐశ్యర్య మాత్రం కూతురు ఆరాధ్యతో పాటు హాజరయ్యారు. ఇక్కడే విడాకుల వార్తలకు బీజం పడింది. ప్రతిష్టాత్మక ఈవెంట్ కి అభిషేక్ తో ఆమె ఎందుకు కలిసిరాలేదనే చర్చ మొదలైంది. కొన్నాళ్లుగా అభిషేక్-ఐశ్వర్య విడాకుల ఊహాగానాలు ఉన్నాయి. నీతూ ముకేశ్ అంబానీ కల్చరల్ ఈవెంట్ వేదికగా ఈ అనుమానాలు బలపడ్డాయి. అభిషేక్-ఐశ్వర్య రాయ్ విడిపోతున్నానంటూ బాలీవుడ్ మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి.

    2007లో అభిషేక్ బచ్చన్ మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు. ఆమె పేరు ఆరాధ్య కాగా వయసు 11 ఏళ్ళు. వివాహానికి ముందు వివేక్ ఒబెరాయ్, సల్మాన్ ఖాన్ లతో ఎఫైర్ నడిపారనే వాదన ఉంది. సల్మాన్ ఖాన్ ఆమెను వేధింపులకు గురి చేశాడని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. గత పదిహేనేళ్లుగా ఐశ్వర్య-అభిషేక్ అన్యోన్యంగా ఉంటున్నారు. ఈ విడాకుల వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.

    Abhishek Bachchan- Aishwarya Rai Divorce

    1994లో ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ టైటిల్ అందుకున్నారు. దర్శకుడు మణిరత్నం ఆమెను వెండితెరకు పరిచయం చేశారు. ‘ఇద్దరు’ మూవీలో మోహన్ లాల్ కి జంటగా ఐశ్వర్య రాయ్ నటించారు. వెంటనే ఆమె బాలీవుడ్ కి వెళ్లిపోయారు. అక్కడ బిజీ అయ్యారు. తెలుగులో ఐశ్వర్య రాయ్ ఒక్క చిత్రం కూడా చేయలేదు. నాగార్జున హీరోగా తెరకెక్కిన రావోయి చందమామ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేశారు.