Airplane accident : అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాలిలో ఎగురుతుండగా దానిటైరు ఊడి కిందపడింది. అప్రమత్తమైన పైలెట్లు వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. క్షేమంగా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఏం జరిగిందంటే..
యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777-200 విమానం గురువారం ఉదయం(అమెరికా కాలమానం ప్రకారం) శాన్‌ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి జపాన్‌లోని ఒసాకాకు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే వెనుకవైపు ల్యాండింగ్ గేట్‌లోని ఓ టైరు ఊడిపోయింది. అది విమానాశ్రయం పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన కారుపై పడింది. దాని తీవ్రతకు కారు ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కింద నుంచి వీడియో తీసిన ప్రయాణికుల బంధువులు ఆ వీడియోను ట్విట్టర్(ఎక్స్)లో పోస్టు చేయడంతో నెటిజన్లు చూసి వామ్మో అనుకుంటున్నారు.
పైలెట్ల అలర్ట్..
విమానం టైరు ఊడిన విషయాన్ని గుర్టించిన పైలెట్లు వెంటనే దానిని దారిమళ్లించారు. లాస్‌ఏంజిల్స్‌లోని ఎయిర్‌పోర్టలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అప్పటి వరకు ఊపిరి బిగబట్టుకుని కూర్చున్న ప్రయాణికులు హమ్మయ్య అనుకున్నారు. విషయం తెలుసుకున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ యాజమాన్యం మరో విమానంలో ప్రయాణికులను గమ్యస్థానానికి పంపింది. టైరు ఊడిపోయిన విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు.
గేర్లకు అటాచ్‌గా టైర్లు..
బోయింగ్ 777 విమానాల్లో రెండు ల్యాండింగ్ గేర్లు ఉంటాయి. వాటికి అటాచ్‌గా ఆరు చొప్పున టైర్లు ఉంటాయి. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినా, చక్రాలు ఊడినా సేఫ్‌గా ల్యాండ్ అయ్యేలా దీనిని డిజైన్ చేశారు. అందుకే టైరు ఊడిపోయినా 235 మంది ప్రయాణికులు, 14 మందితో టేకాఫ్ అయిన విమానం సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
It seems like we are seeing at least one plane incident a week at this point.
United Airlines Boeing 777 loses tire while taking off crushing multiple cars on the ground
Forced emergency landing after losing one or two tires during takeoff from San Francisco en route to Osaka pic.twitter.com/UIloq7c6nC
— PatriotJuls 1776 (@JRColbert1) March 8, 2024