Met Gala AI Pics: “మెట్ గాలా”.. అమెరికాలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో ఇది కూడా ఒకటి. అందమైన యువతులు, సెలబ్రిటీలు ఒకచోట చేరి అధునాతనమైన డ్రెస్సులతో కన్నుల విందు చేస్తారు. అందమైన అమ్మాయిలు, అంతకు మించిన అందమైన డ్రెస్సులు వేసుకొని వస్తుంటారు. చూసిన వాళ్లకు చూసినంత ఆనందాన్ని పంచుతుంటారు. న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సాధారణంగా అమెరికా అంటేనే మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి…మెట్ గాలా కు విశేష ప్రాచుర్యం లభిస్తుంది. అందమైన అమ్మాయిలకు మాత్రమే పరిమితమైన మెట్ గాలా లో పురుషులు కూడా ప్రవేశిస్తే, అందులోనూ బిలియనీర్లు సందడి చేస్తే ఎలా ఉంటుంది? అదేంటి ఫ్యాషన్ ఈవెంట్ లో వ్యాపారవేత్తలకు ఏం పని అనుకుంటున్నారా? అయితే ఇక్కడే మీరు ఏఐ లో కాలేశారు. ఇంతకీ ఆ అదేంటో మీరూ చదివేయండి.
ఏఐ మహిమ మరి
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ స్థూలంగా చెప్పాలంటే కృత్రిమ మేథ… ఇప్పుడు ఇది చేస్తున్న అద్భుతాలు అన్ని ఇన్ని కావు.. రోజుకో రకం సాంకేతికత తో ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేస్తున్నది. ఇలాంటి ఈ ఏఐ తో అబూ సాహిబ్ అనే వ్యక్తి పెద్ద అద్భుతమే చేసాడు.. ఊపిరి తీసుకునేందుకు కూడా క్షణం ఖాళీ లేని పెద్ద పెద్ద బిలియనీర్లను మెట్ గాలాకు తీసుకెళ్లాడు.. అంత కాదు తన మెదడులో మెదిలిన ఊహకు ప్రాణం పోశాడు.. ఆ ఊహలో ఒక్కో బిలియనీర్…ఒక్కో ఆ విధంగా ఉన్నాడు. సూట్, బూట్ తో దర్శనమిచ్చే పెద్ద పెద్ద వ్యాపారులు అధునాతనమైన ఫ్యాషన్ డ్రెస్సులతో కనులవిందు చేశారు. ఇంతకుముందు ఎన్నడూ వేయని డ్రెస్సులను వారు ధరించారు.
వీరే ఆ బిలియనీర్లు
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్రా, ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్, మెటా అధిపతి మార్క్ జూకర్ బర్గ్ ఈ మెట్ గాలాకు హాజరవుతున్నట్టు అబూ సాహిబ్ ఊహించి ఈ ఫోటోలను సృష్టించాడు.. “మిడ్ జర్నీ” సహాయంతో రూపొందించిన ఈ ఫోటోలలో బాబా రాందేవ్, విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ లాంటి దిగ్గజాల ఫోటోలు కూడా ఉండడం విశేషం. ఇక అబూ సాహిబ్ కృత్రిమ మేథతో రూపొందించిన ఈ చిత్రాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి..
సోషల్ మీడియాలో పోస్ట్
ప్రపంచ వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లు, డిజిటల్ ఆర్టిస్టులు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా రూపొందించిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో ఇటీవల కాలంలో ఎక్కువగా పోస్ట్ చేస్తున్నారు..ఈ జాబితాలో అబూ సాహిబ్ ముందు వరుసలో ఉంటాడు.. ఆ మధ్య మే డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ఎలాన్ మస్క్ వరకు వారి వారి పనుల్లో ఎలా నిమగ్నమయ్యారో ఏఐ ద్వారా అబూ సాహిబ్ రూపొందించాడు.. ఈ ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అన్నట్టు అబూ సాహిబ్ కు ఇన్ స్టా గ్రామ్ లో 21.6 వేల ఫాలోవర్స్ ఉన్నారు.