Mahatma Gandhi- Subhas Chandra Bose Selfie: సెల్ఫీ.. ఇది ఇప్పుడు నయా ట్రెండ్. ఒకప్పుడు ఎక్కడికైనా వెళితే ఫోటో తీసుకోవడం ఎంత సహజమో.. ఇప్పుడు సెల్ఫీ తీసుకోవడం అంతకంటే సహజాతి సహజం అయిపోయింది. ఈ సెల్ఫీ ట్రెండ్ రాకముందు నాటి స్వాతంత్ర సమరయోధులు, కీలక నేతలు సెల్ఫీలు తీసుకుంటే.. ఎలా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి నాటి అగ్ర నేతల సెల్ఫీల ఫోటోలు విడుదల అయ్యాయి. అవి ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఏ పర్యాటక ప్రాంతానికి వెళ్లిన, ఏ ఇద్దరు స్నేహితులు కలిసిన, సరికొత్త ప్రదేశాన్ని సందర్శించిన సెల్ఫీ తీసుకోవడం అత్యంత సహజంగా కనిపిస్తోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు సెల్ఫీ తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లలోనూ వందలాది సెల్ఫీ ఫోటోలు ఉంటాయి అనడంలో అతిశయోక్తి ఏమి ఉండదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫోటో తీసుకోవడం కంటే సెల్ఫీ తీసుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. అయితే, మనకు తెలిసి సెల్ఫీ ట్రెండ్ గత దశాబ్ద కాలం నుంచి ఎక్కువగా కనిపిస్తోంది. ముందు ఈ సెల్ఫీ తీసుకోవడం అన్నది లేదు. అటువంటిది సుమారు వందేళ్ల క్రితం నాటి నేతలు సెల్ఫీలు తీసుకుంటే.. ఆ సెల్ఫీ ఫోటోలను ఇప్పుడు మనం వీక్షిస్తే ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అటువంటి పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసి చూపించారు. దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చి పెట్టిన పలువురు జాతీయ నేతలతో పాటు, అంతర్జాతీయంగా పేరుగాంచిన పలువురు నేతల సెల్ఫీలతో కూడిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
గాంధీజీ సెల్ఫీ ఫోటో..
భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ కీలక పాత్ర పోషించారు. 20వ శతాబ్దంలో దేశ స్వాతంత్రం కోసం ఆయన చేసిన పోరాటం ఎనలేనిది. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం.. వంటి అనేక పోరాటాలతో భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకువచ్చారు. అటువంటి గాంధీ పోరాటాల్లోని ఒక కీలక ఘట్టానికి సంబంధించి.. స్వయంగా గాంధీజీ సెల్ఫీ తీసుకున్నట్లుగా ఒక సెల్ఫీ ఫోటోను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ ద్వారా రూపొందించి విడుదల చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే, భారతదేశ తొలి ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు, సెక్యులర్ హ్యూమనిస్ట్ అయిన జవహర్ లాల్ నెహ్రూ సెల్ఫీ ఫోటోను రూపొందించి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ ఫోటో కూడా తెగ వైరల్ అవుతుంది. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో సుభాష్ చంద్రబోస్ పాత్ర ఎనలేనిది. స్వాతంత్ర పోరాటంలో బోసు హీరోగా గుర్తింపు పొందారు. వెస్ట్రన్ దేశాలకు వ్యతిరేకంగా అబ్రాడ్ వేదికగా ఇండియన్ ఫోర్స్ కు సుభాష్ చంద్రబోస్ రెండో ప్రపంచ యుద్ధంలో నాయకత్వం వహించారు. ఆంగ్లేయులపై హింసాత్మక రీతిలోనే పోరాటానికి ఆయన సిద్ధమయ్యారు. సుభాష్ చంద్రబోస్ తీసుకున్నట్లుగా విడుదల చేసిన ఓ సెల్ఫీ ఫోటో ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అభాగ్యులతో మథర్ థెరీసా సెల్ఫీ ఫోటో..
మేరీ థెరీసా బోజాక్సు.. అందరికీ మథర్ థెరీసాగా సుపరిచితం. భారతదేశానికి ఒక నన్ గా వచ్చిన ఆమె కలకత్తా కేంద్రంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. ముఖ్యంగా కుష్టు వ్యాధిగ్రస్తుల కోసం ఎంతగానో పనిచేశారు. భారతదేశంలో మిషనరీస్ ఆఫ్ చారిటీకి వ్యవస్థాపకురాలుగా ఆమెకు ఎంతో పేరుంది. అటువంటి ఆమె సెల్ఫీ ఫోటోలు తాజాగా ఏఐ విడుదల చేసింది. అభాగ్యులతో ఆమె సెల్ఫీ తీసుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అలాగే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమెరికాలో సివిల్ రైట్ మూమెంట్ అత్యంత కీలకంగా వ్యవహరించిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పలువురు తో కలిసి తీసుకున్న సెల్ఫీ ఫోటో కూడా ఏఐ విడుదల చేసింది. అలాగే అమెరికా ప్రెసిడెంట్ గా పని చేసిన ప్రముఖ లాయర్, రాజకీయ నాయకుడు అయిన అబ్రహం లింకన్ సెల్ఫీ ఫోటో కూడా ఏఐ విడుదల చేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సాధ్యం..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అసాధ్యాన్ని సుసాధ్యం చేసే అవకాశం ఉంది. ఈ అధునాతన టెక్నాలజీతో ప్రపంచంలో ఇప్పటివరకు సాధ్యం కావని భావించిన ఎన్నో.. చేసి చూపెడుతున్నారు టెక్నాలజిస్టులు. తాజాగా అటువంటి అసాధ్యాన్ని ప్రముఖుల సెల్ఫీల రూపంలో విడుదల చేసి సరి కొత్తగా సోషల్ మీడియా వీక్షకులకు చూపించే ప్రయత్నం చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆయా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుండడం గమనార్హం.