
Aha News Paper: తెలుగు డిజిటల్ ప్రపంచం లో ‘ఆహా మీడియా’ ఒక సంచలనం అనే చెప్పాలి.ప్రముఖ దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ సారథ్యం లో మన ముందుకి వచ్చిన ఆహా మీడియా, చూస్తూ ఉండగానే ఇండియా లో టాప్ 10 ఓటీటీ యాప్స్ లో ఒకటిగా నిల్చింది.సరికొత్త టాక్ షోస్ మరియు ఆసక్తికరంగా ఆహా ఒరిజినల్ వెబ్ సిరీస్ మరియు ఎంటర్టైన్మెంట్స్ షోస్ తో అనతి కాలం లోనే ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది.
అంతే కాదు లేటెస్ట్ గా విడుదలవుతున్న సినిమాలు కూడా ఇందులో అప్లోడ్ అవుతున్నాయి.ఇక నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ రెండు సీజన్స్ సూపర్ హిట్ అవ్వడం, పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు మరియు ప్రభాస్ వంటి హీరోలు ఈ టాక్ షో కి ముఖ్య అతిథులుగా రావడం తో ఆహా ని వినియోగించే కస్టమర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది.
అయితే డిజిటల్ ప్రపంచం లో సంచలనం సృష్టించిన ‘ఆహా మీడియా’ ఇప్పుడు దిన పత్రిక రూపం లో అతి త్వరలో మన ముందుకి రాబోతుందని,ఆహా మీడియా ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది.తమ దినపత్రిక ఎలా ఉంటుందో నమూనా తో సహా అప్లోడ్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

అయితే ఈ దినపత్రిక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి బాగా ఉపయోగ పడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.ఎందుకంటే రాజకీయాల్లో నెగ్గుకు రావాలంటే కచ్చితంగా మీడియా ఉండడం తప్పనిసరి.అటు పక్క టీడీపీ మరియు వైసీపీ పార్టీలకు మీడియా ఉంది, దిన పత్రికలు కూడా ఉన్నాయి.అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ బంధువు కాబట్టి ఈ దినపత్రిక జనసేన పార్టీ కి బాగా ఉపయోగపడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.జులై 1 వ తేదీ నుండి ఈ దినపత్రిక మార్కెట్ లోకి అందుబాటులోకి రాబోతుంది.