
Venkatesh Assets: సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో గురించి చర్చ ఉంటుంది. కానీ విక్టరీ వెంకటేష్ గురించి తక్కువే అని చెప్పాలి. మొన్నటి వరకు సినిమాల్లో తప్ప రియల్ గా ఎక్కువగా ఈ హీరో కనిపించలేదు. దీంతో ఆయన పర్సనల్ విషయాలు బయటికి రాలేదు. ముఖ్యంగా ఆయన ఫ్యామిలీ గురించి, ఆస్తుల గురించి ఎక్కడా చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు వాటి గురించి తీవ్రంగా చర్చ సాగుతోంది. దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన ఆస్తుల వివరాలన్నీ డి రామానాయుడు తమ్ముడు మోహన్ బాబుకు మాత్రమే తెలుసట. ఇందులో వెంకటేష్ కు సంబంధించిన అస్సెట్స్ డిటేయిల్స్ కూడా ఉన్నాయి. ఇటీవల ఆయన మరణించడంతో వెంకటేష్ ఆస్తుల వివరాలేంటి? అన్న చర్చ సాగుతోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కుటుంబం నుంచి డి రామానాయుడు నిర్మాతగా ఫిల్మ్ రంగంలోకి వచ్చి ఎన్నో అద్భుత సినిమాలు నిర్మించారు. కొన్ని సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వారసులుగా ఇద్దరు కుమారులు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు పెద్ద కొడుకు సురేష్ బాబు నిర్మాతగా కూడా సక్సెస్ సినిమాలు నిర్మించాడు. చిన్న కుమారుడు వెంకటేష్ స్టార్ నటుడయ్యారు. ఇప్పటికీ పలు చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంటున్నాడు.

వెంకటేష్ సినిమాలో నటించినందుకు ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు తీసుకుంటాడట. సినిమాల్లోనే కాకుండా పలు యాడ్స్ తో ఈయన బిజీగా మారాడు. వీటితో పాటు కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. సినిమాలో సెంటిమెంట్ ను పండించే విక్టరీ రియల్ గా మాత్రం స్ట్రేట్ ఫార్వడ్ ఉంటారని తెలుస్తోంది. ముఖ్యంగా కమర్షియల్ గా ఆయన కొన్ని రూల్స్ పెట్టుకుంటారన్న చర్చ సాగుతోంది. డబ్బును పోగేయ్యడంలో ఒక ప్రాసెస్ పాటిస్తారట.
తండ్రి డి రామానాయుడు నుంచి వచ్చిన, ఇతర ఆస్తులు కలిపి వెంకటేష్ కు ప్రస్తుతం రూ.26000 కోట్లు ఉంటాయని చర్చ సాగుది. ఇవే కాకుండా ఆయనకు ఇంద్రభవనం లాంటి ఇల్లు, లగ్జరీ కార్లు ఉన్నాయి. రామానాయుడు స్టూడియోలో ఆయనకు వాటా వచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇవే కాకుండా వెంకీకి తెలియని మరికొన్ని ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అయితే దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ ఆయన చిన్నాన్న మోహన్ బాబు చూసుకునేవారట. ఇటీవల ఆయన మరణించడంతో తన ఆస్తులు లెక్క తేలేదెలా? అన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా తండ్రి రామానాయుడుతో పాటు చిన్నాన్నపై కూడా ప్రేమ ఉండేదని అనుకుంటున్నారు.