Kerala Anganwadis: కేరళ రాష్ట్రంలో మాత్రం అంగన్వాడీ కేంద్రాలలో చికెన్ ఫ్రై, చికెన్ బిర్యాని వడ్డించనున్నారు. ఇటీవల అంగన్వాడి కేంద్రంలో శంకు అనే చిన్నారిని ఆమె తల్లి అంగన్వాడీ కేంద్రానికి తీసుకొచ్చింది.. శంకు సహజంగానే అల్లరి పిల్లాడు.. అక్కడి అంగన్వాడి కేంద్రంలో అతడికి ఆహారం తినిపించుకుంటూ… అతడి తల్లి ఒక సరదా వీడియో తీసింది.. అంగన్వాడి కేంద్రానికి వస్తే నీకేం కావాలి,? ఎలాంటి ఆహారాన్ని ఇక్కడ నువ్వు కోరుకుంటున్నావ్? ఇక్కడికి వస్తే నీకు ఏం తినాలి అనిపిస్తుంది? అని ప్రశ్నించగా.. “నాకు అంగన్వాడి కేంద్రానికి వస్తే బిర్యాని పెట్టాలి. అందులోకి చికెన్ ఫ్రై ఇంకా బాగుంటుంది. దానివల్ల ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది.. బిర్యాని తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. చికెన్ ఫ్రై కూడా అద్భుతంగా ఉంటుంది. ఆ పని చేస్తే నాకెంతో నచ్చుతుందని” శంకు బదులిచ్చాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియా ద్వారా కేరళ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్ దృష్టికి వెళ్ళింది. దీంతో ఆమె ఈ వీడియో పై ప్రత్యేకంగా స్పందించారు..
కచ్చితంగా అమలు చేస్తాం
” చిన్నారి శంకు మాట్లాడిన మాటలు ఎంతో బాగున్నాయి. కచ్చితంగా చికెన్ బిర్యాని, చికెన్ ఫ్రై మెనూ అమలు చేస్తాం. పిల్లల ఆరోగ్యానికి కేరళ ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తోంది. ఇప్పటికే అంగన్వాడి కేంద్రాలలో పాలు, గుడ్లు అందిస్తోంది. ముఖ్యమంత్రి విజయన్ కూడా చిన్నారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో ఉన్నారు. ఆయన పరిశీలనలోకి ఈ విషయాన్ని తీసుకెళ్తాం. కచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో చికెన్ బిర్యాని, చికెన్ ఫ్రై మెనూ అమలు చేస్తాం. చిన్నారులకు బలవర్ధకమైన ఆహారం అందిస్తేనే వారు ఆరోగ్యంగా ఉంటారు. సమాజం కూడా గొప్పగా ఉంటుంది. ఆరోగ్యమైన పౌరుల ద్వారానే బలమైన దేశం ఏర్పడుతుంది. అదేవిదానాన్ని కేరళ ప్రభుత్వం కొనసాగిస్తుందని” వీణా పేర్కొన్నారు. మరోవైపు శంకు వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అతని బుల్లి బుల్లి మాటలు ఆలోచింపజేస్తున్నాయి. చికెన్ బిర్యాని కావాలని.. చికెన్ ఫ్రై తింటానని అతడు చెప్పడం నవ్వు తెప్పిస్తోంది. అయితే ఈ వీడియోను ఆమె తల్లి చిత్రీకరించిందని.. అంగన్వాడి గ్రూపుల నుంచి వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా ఈ వీడియో బయట సమాజానికి తెలిసిందని.. అందువల్లే కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుందని.. కేరళ మీడియా ప్రసారం చేసిన తన కథనాలలో పేర్కొంది.
కేరళ రాష్ట్రంలో అంగన్ వాడీ మెనూలో బిర్యానీ, చికెన్ ఫ్రై చేర్చాలని శంకు అనే చిన్నారి కోరగా.. దానిని అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వీణ జార్జి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.#kerala #KeralaministerVeenaGeorge pic.twitter.com/9bNOYGzmOg
— Anabothula Bhaskar (@AnabothulaB) February 5, 2025