https://oktelugu.com/

స్నేహితుడి భార్యతో ఎఫైర్.. ఆమె భర్తను ఏం చేసారో తెలుసా?

వివాహేతర సంబంధాలు కాపురాలు కూలుస్తున్నాయి. ఎఫైర్లు హత్యలకు దారితీస్తున్నాయి. క్షణికావేశంలో చేసే తప్పులు పెద్ద అనర్థాలకు కారణమవుతున్నాయి. తాజాగా స్నేహితుడి భార్యతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని స్నేహితుడిని హతమార్చాలని పథకం వేశాడు. స్నేహితుడిని ఓ బ్రిడ్జి కిందికి తీసుకెళ్లి బాగా మద్యం తాగించి హత్య చేశాడు. ఆ తర్వాత అది ఆత్మహత్యగా చిత్రికరించి తప్పించుకోవాలని అనుకున్నాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 7, 2021 / 09:54 PM IST
    Follow us on

    వివాహేతర సంబంధాలు కాపురాలు కూలుస్తున్నాయి. ఎఫైర్లు హత్యలకు దారితీస్తున్నాయి. క్షణికావేశంలో చేసే తప్పులు పెద్ద అనర్థాలకు కారణమవుతున్నాయి. తాజాగా స్నేహితుడి భార్యతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని స్నేహితుడిని హతమార్చాలని పథకం వేశాడు. స్నేహితుడిని ఓ బ్రిడ్జి కిందికి తీసుకెళ్లి బాగా మద్యం తాగించి హత్య చేశాడు. ఆ తర్వాత అది ఆత్మహత్యగా చిత్రికరించి తప్పించుకోవాలని అనుకున్నాడు. కానీ నిజం బయటపడింది.

    ఏపీలోని నెల్లురు జిల్లా నిడిగుంటపాలెం లో ఇక వ్యక్తి తన భర్యతో కలిసి జీవిస్తున్నాడు. ఇతడికి ఒక స్నేహితుడు ఉన్నాడు. తరచూ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. దీంతో మెల్లగా స్నేహితుడి భార్యతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రాణ స్నేహితుడి భార్యతో ఎంజాయ్ చేస్తుండగా.. అప్పుడే వచ్చిన భర్త వీరిద్దరూ పడక గదిలో అలా కనిపించేసరికి షాక్ అయ్యాడు.. భార్యతో గొవడ పడ్డాడు.

    ఆమె అతడిని వదిలి పెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య అలా వెళ్లిపోవడంతో జీర్ణించుకోలేని భర్త.. ఎఫైర్ పెట్టుకున్న తన స్నేహితుడితో గొడవకు దిగాడు. తన భార్య అలా వెళ్లిపోవడానికి కారణం నువ్వే అంటూ అగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో సీరియస్ అయిన అతడు స్నేహితుడిని ఎలా అయిన అడ్డు తొలగించుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. మిగతా స్నేహితుల సాయంతో పక్క ప్రణాళికతో మద్యం తాగుదామని స్నేహితుడిని ఓ బ్రిడ్జి కిందకి తీసుకెళ్లారు. బాగా తాగించి మత్తులోకి జారుకోగానే గొంతు నులిమి చంపేసి కాల్వలో పడి చనిపోయాడని అందరిని నమ్మించాడు.

    పోస్టుమార్టం నిర్వహించగా అతడిది హత్య అని తెలింది. పోలీసులు విచారణ చేపట్టాగ అసలు నిజం బయటపడింది. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుడి భార్యతోనే ఎఫైర్ పెట్టుకొని అతడినే హతమార్చిన వైనం విస్తుగొలుపుతోంది.