Bigg Boss 6 Telugu- Adi Reddy: బిగ్ బాస్ సీజన్ 6 ఫినాలే వీక్ కి వచ్చేసింది..ప్రతి రోజు ఊహించని మలుపులతో,సందర్భానుసారంగా టాస్కుల మధ్య వచ్చే కంటెస్టెంట్స్ భావోద్వేగాలు, కోపతాపాలతో పాటు ఎవ్వరి ఊహకందని ఎలిమినేషన్స్ తో ఈ సీజన్ సాగిపోయింది..ఒక విధంగా చెప్పాలంటే ఈ సీజన్ ఫ్లాప్ అనే చెప్పాలి..ప్రజాతీర్పు కి వ్యతిరేకంగా ఎలిమినేషన్స్ జరగడమే అందుకు కారణమని అంటున్నారు విశ్లేషకులు.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఒక సాధారణ మనిషి గా అడుగుపెట్టిన ఆది రెడ్డి తన ఆటతీరుతో ప్రేక్షకుల మనసుల్ని గెలిచి నేడు టాప్ 6 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచాడు..గేమ్స్ ఆడడం లో అతని స్ట్రాటజీలు , మరియు తోటి కంటెస్టెంట్స్ తో అతను నడుచుకునే విధానము ప్రతి ఒక్కరికి ఎంతగానో నచ్చింది..అందుకే చివరి వారం వరకు ఆయన రాగలిగారు..బిగ్ బాస్ హిస్టరీ లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి ఇన్ని రోజులు హౌస్ లో ఉండడం గతం లో ఎప్పుడూ కూడా జరగలేదు.
కేవలం తెలుగు బిగ్ బాస్ లోనే కాదు..తమిళం, హిందీ , మలయాళం మరియు కన్నడ బాషలలో నిర్వహిస్తున్న బిగ్ బాస్ షోస్ లో కూడా ఒక కామన్ మ్యాన్ సెలబ్రిటీ ఫేమ్ ఉన్న కంటెస్టెంట్స్ ని దాటుకొని ఇంత దూరం రావడం ఎప్పుడూ జరగలేదు..మొదటిసారి ఈ సీజన్ లోనే జరిగింది..అతను టైటిల్ గెలుస్తాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్..కానీ టైటిల్ గెలిచినా గెలవకపోయిన ఒక కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టి టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచిన వ్యక్తిగా ఆది రెడ్డి నిలిచిపోతాడు.

భవిష్యత్తులో జరగబొయ్యే సీజన్స్ లో ఇలాంటి కంటెస్టెంట్ మళ్ళీ వస్తాడో రాడో తెలియదు కానీ..ఆది రెడ్డి బిగ్ బాస్ ప్రస్థానం మాత్రం చాలా ఆదర్శప్రాయంగా సాగింది..చివరి వీక్ వరుకూ హౌస్ లో కొనసాగి..తన బిగ్ బాస్ జర్నీ ని గార్డెన్ ఏరియా లో పోడియం మీద నిలబడి చూడాలనేది ఆది రెడ్డి కోరిక..ఆ కోరికని ఆయన నిన్న జరిగిన ఎపిసోడ్ ద్వారా తీర్చుకున్నాడు.