Adi Reddy – Sri Satya: గత సీజన్స్ లో ఎన్నడూ కూడా జరగని కొన్ని వింత సంఘటనలు..విచిత్రమైన నిర్ణయాలు ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోనే జరిగాయి..21 మంది కంటెస్టెంట్స్ తో గ్రాండ్ గా లాంచ్ అయిన బిగ్ బాస్ సీజన్ 6 ,గత వారం ఇనాయ ఎలిమినేషన్ తో ఆరుమంది కంటెస్టెంట్స్ కి చేరుకుంది..ఇక ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్స్ ఉంటుందని నాగార్జున మొన్న జరిగిన ఆదివారం ఎపిసోడ్ లోనే తెలియచేసాడు.

ఆదివారం అర్థరాత్రి నుండి బుధవారం వరుకూ నమోదైన ఓట్లని పరిగణలోకి తీసుకొని ఈ ఎలిమినేషన్ ఉండబోతుందని నాగార్జున తెలిపాడు..ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం చూస్తే టాప్ 2 స్థానాల్లో రేవంత్ మరియు శ్రీహాన్ కొనసాగుతుండగా..బాటమ్ టాప్ 2 లో ఆదిరెడ్డి మరియు శ్రీ సత్య ఉన్నారు..డేంజర్ జోన్ లో ఉన్న వీళ్ళిద్దరిలో నుండి ఒకరు ఈరోజు ఎలిమినేట్ అవ్వబోతున్నారు..ఆ ఒక్కరు ఎవరు అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది.
జరిగిన ఓటింగ్ ప్రకారం అయితే శ్రీ సత్య ఎలిమినేట్ అవ్వాలి..సోషల్ మీడియా లో పాపులర్ వెబ్ సైట్స్ నిర్వహిస్తున్న అనధికారిక పోలింగ్ లో శ్రీ సత్య ఆది రెడ్డి తో పోలిస్తే 50 శాతం తక్కువ ఓట్లతో కొనసాగుతుంది..కాబట్టి లెక్కప్రకారం ఆమెనే ఎలిమినేట్ అవ్వాలి..కానీ బిగ్ బాస్ లో ఈమధ్య అందరూ ఊహించే విధంగా ఫలితాలు రావడం లేదు..బిగ్ బాస్ కి తోచిన కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసుకుంటూ ముందుకు పోతున్నాడు..ఇక గత వారం ఇనాయ ఎలిమినేట్ అవ్వడం ఈ షో పై చాలా తీవ్రమైన నెగటివిటీ ని తీసుకొచ్చింది.

టాప్ 2 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిల్చేంత ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఇనాయ ఎలిమినేట్ అవ్వడం అనేది ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు..ఇక ఈరోజు జరగబొయ్యే ‘మిడ్ వీక్ ఎలిమినేషన్స్’ కూడా అలాగే ఉండబోతుందా..ఒకవేళ శ్రీ సత్య ని తొలగించకుండా ఆది రెడ్డి ని తొలగిస్తే మాత్రం గతం లో జరిగిన ఎలిమినేషన్స్ అన్నీ కూడా అన్యాయంగానే జరిగాయని నిర్ధారణకు రావొచ్చు.