కోతి వల్ల కోర్టుకెక్కిన నటి.. కోతిని పట్టిస్తే 50 వేల రూపాయలు?

ప్రతి దేశంలో జంతువులను పెంచుకునే విషయంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. కొన్ని దేశాల్లో కొన్ని జంతువులను పెంచుకోవడానికి అనుమతి ఉంటే మరికొన్ని జంతువులను పెంచుకోవడానికి మాత్రం అనుమతి ఉండదు. అలా మన దేశంలో కోతిని పెంచుకోరాదని నిబంధనలు ఉన్నాయి. అయితే పంజాబ్ లోని ఒక నటి మాత్రం నిబంధనలకు విరుద్ధంగా కోతిని పెంచుకోవడం వల్ల కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే పంజాబ్‌లోని చండీగఢ్ లో కమల్‌జీత్‌ సింగ్‌ అనే నటి నివశిస్తూ ఉండేది. […]

Written By: Navya, Updated On : September 27, 2020 9:51 am
Follow us on

monkey

ప్రతి దేశంలో జంతువులను పెంచుకునే విషయంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. కొన్ని దేశాల్లో కొన్ని జంతువులను పెంచుకోవడానికి అనుమతి ఉంటే మరికొన్ని జంతువులను పెంచుకోవడానికి మాత్రం అనుమతి ఉండదు. అలా మన దేశంలో కోతిని పెంచుకోరాదని నిబంధనలు ఉన్నాయి. అయితే పంజాబ్ లోని ఒక నటి మాత్రం నిబంధనలకు విరుద్ధంగా కోతిని పెంచుకోవడం వల్ల కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే పంజాబ్‌లోని చండీగఢ్ లో కమల్‌జీత్‌ సింగ్‌ అనే నటి నివశిస్తూ ఉండేది. ఆమెకు కోతులంటే మహా ఇష్టం. దీంతో ఆమె ఓ కోతిని సరదాగా పెంచుకునేది. అయితే నటి కోతిని పెంచుకుంటున్నట్టు అటవీశాఖ అధికారులకు తెలిసింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కోతిని పెంచుకోవడం నేరం. అయితే ఈ విషయం తెలియని నటి కోతిని పెంచుకున్నందుకు అటవీశాఖ అధికారులు ఆమెతో పాటు ఆమె మేనేజర్ ను సైతం అరెస్ట్ చేశారు.

పోలీసుల విచారణలో నటి కమల్ జీత్ సింగ్, మేనేజర్ దీపక్ ఓహ్రా తమ దగ్గర ఒక కోతి ఉండేదని.. కోతిని పెంచుకోవడం నిజమేనని.. అయితే చట్టాల ప్రకారం కోతిని పెంచుకోవడం నేరం కావడంతో ఆ కోతిని అడవిలో విడిచిపెట్టామని వారు చెప్పారు. అనంతరం వారు బెయిల్ పై విడుదలయ్యారు. అయితే వాళ్లు కోతిని విడిచిపెట్టామని చెప్పిన మాటలను ఎవరూ నమ్మలేదు.

పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్ అనే స్వచ్ఛంద సంస్థ నటి నిజాలు దాస్తోందని పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కోర్టు కోతిని విడిచిపెట్టినట్టు ఆధారాలు చూపించాలని పేర్కొంది. మరో పది రోజుల్లో నటి ఆధారాలు సమర్పించాల్సి ఉంది. దీంతో ఏం చేయాలో పాలుపోక కోతిని పట్టిస్తే 50 వేల రూపాయలు నజరానా ఇస్తామని నటి ప్రకటించింది. కోతిపై నజరానా ప్రకటించడం పంజాబ్ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.