Actress Surekha Vani: కాలం కలిసి రాలేదు కానీ సురేఖా వాణి స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవాల్సింది. మంచి హైట్, స్లిమ్ బాడీ, చక్కని నటన ఆమె సొంతం. హీరోయిన్ కావడానికి ఇంతకన్నా గొప్ప ఫీచర్స్ ఏం కావాలి చెప్పండి.

విజయవాడకు చెందిన సురేఖ చిన్నప్పటి నుండి నటి కావాలని కలలు కనేవారు. చదువుకునే రోజుల్లో విరివిగా కల్చరల్స్ లో పాల్గొనేవారు. చదువు పూర్తి కాగానే హైదరాబాద్ కి వచ్చారు.

సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం అంత సులభం కాదు. అక్కడ దాకా వెళ్లాలంటే చాలా సవాళ్లు ఎదుర్కోవాలి. అందుకే సురేఖ యాంకర్ అవతారం ఎత్తారు. విజయవాడలో ఉన్నప్పుడు యాంకర్ గా చేసిన అనుభవం ఉంది.

స్టార్ మాలో వ్యాఖ్యాతగా పనిచేస్తున్న రోజుల్లో సురేష్ తేజ పరిచయమయ్యాడు. ఆయన ప్రోగ్రామ్స్ డైరెక్టర్ గా ఉండేవారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్ళికి దారి తీసింది.

నటిగా ప్రయత్నాలు చేస్తున్న సురేఖా వాణికి ‘శీనుగాడు చిరంజీవి ఫ్యాన్’ మూవీలో ఆఫర్ వచ్చింది. ఆ చిత్రంలో ఓ చిన్న రోల్ చేశారు. బొమ్మరిల్లు మూవీతో ఫేమ్ వచ్చింది.
రెడీ మూవీతో సురేఖా వాణి బాగా పాపులర్ అయ్యారు. ఇండైరెక్ట్ గా విలన్ జయప్రకాష్ రెడ్డిని తిట్టే కోడలి పాత్రలో కడుపుబ్బా నవ్వించారు. దర్శకుడు శ్రీను వైట్ల ఆమెకు మంచి పాత్రలు ఇచ్చారు.

ఒక దశలో లేడీ కమెడియన్ గా సురేఖా వాణి సెటిల్ అయ్యారు. 2019లో భర్త సురేష్ తేజ కన్నుమూశారు. దాంతో కొన్నాళ్ళు ఆమె సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యారు. ఈ లోపు లాక్ డౌన్ కారణంగా పరిశ్రమ కుదేలైంది.
గతంలో మాదిరి సురేఖా వాణి సిల్వర్ స్క్రీన్ మీద కనిపించడం లేదు. ఓ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో మాట్లాడిన సురేఖా వాణి అసహనం వ్యక్తం చేశారు. పరిశ్రమ మమ్మల్ని మర్చిపోయింది. ఆఫర్స్ ఇవ్వడం లేదంటూ ఆవేదన వెళ్లగక్కారు.

ఇప్పుడిప్పుడే ఆమె బిజీ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో మాత్రం ఆమె అందుబాటులో ఉంటున్నారు. కొన్నాళ్లుగా సురేఖా వాణి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. గ్లామరస్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు.

సురేఖా వాణికి టీనేజ్ డాటర్ ఉన్నారు. ఆమె పేరు సుప్రీత . పేరుకే కూతురు కానీ ఫ్రెండ్స్ కి మించి క్లోజ్ గా ఉంటారు. డిన్నర్ నైట్స్, పార్టీలు కలిసి ఎంజాయ్ చేస్తారు. అప్పుడప్పుడు విహారాలకు వెళతారు. సురేఖా వాణి-సుప్రీతల డాన్స్ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.
