
Akkineni Akhil: అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ఇండస్ట్రీ ని షేక్ చేసే హిట్స్ వచ్చి చాలా కాలమే అయ్యింది..అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా అడుగుపెట్టిన నాగార్జున సుమారు మూడు దశాబ్ధాలపాటుగా స్టార్ హీరోగా కొనసాగాడు,కానీ ఆయన ఇద్దరు కొడుకులు మాత్రం ఇప్పటికీ మీడియం రేంజ్ హీరోలుగానే కొనసాగుతున్నారు.వీళ్లిద్దరికీ స్థిరంగా ఒక 40 కోట్ల మార్కెట్ కూడా ఇంకా రాకపోవడం ఆశ్చర్యార్ధకం.అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో సూపర్ హిట్స్ ఉన్నప్పటికీ ఎందుకో ఆయన స్టార్ కాలేకపోయాడు.
ఇక ఆయన తర్వాత వచ్చిన సోదరుడు అక్కినేని అఖిల్ అయితే ఇప్పటి వరకు బోణి చెయ్యలేదు.ఇప్పుడు రీసెంట్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాన్ ఇండియన్ లెవెల్ లో చేస్తున్న ‘ఏజెంట్’ చిత్రం మీదనే అక్కినేని అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు.ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో అన్ని బాషలలో విడుదల కాబోతుంది.
ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు విడుదల చేసిన రెండు టీజర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది,అక్కినేని అఖిల్ సినిమాకి ప్రస్తుతం భారీ హైప్ కావాలని అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు.వాళ్ళు కోరుకున్నట్టు గానే ‘ఏజెంట్’ సినిమా ద్వారా ఆ భారీ హైప్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.ఈ సినిమాకి మార్కెట్ క్రేజ్ మామూలు రేంజ్ లో లేదనే చెప్పాలి,డిస్ట్రిబ్యూటర్స్ మరియు బయ్యర్స్ నిర్మాతలు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు.ఇప్పటికే అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 120 కోట్ల రూపాయలకు జరిగిందట.

ఒక స్టార్ హీరో కి ఏ రేంజ్ బిజినెస్ అయితే జరుగుతుందో అదే రేంజ్ ఈ సినిమాకి కూడా అదే రేంజ్ బిజినెస్ జరిగింది.ఈ సినిమా క్లిక్ అయితే ఇక అక్కినేని అఖిల్ రేంజ్ మామూలు రేంజ్ హీరో నుండి పాన్ ఇండియా రేంజ్ స్టార్ గా ఎదుగుతాడని అందరూ అంచనా వేస్తున్నారు..మరి అది నిజం అవుతుందో లేదో తెలియాలంటే ఏప్రిల్ 28 వరకు ఆగాల్సిందే.