Homeట్రెండింగ్ న్యూస్Actress Sri Sudha: విమానంలో వెకిలి చేష్టలు.. బొక్కలు విరగొట్టిన టాలీవుడ్ నటి

Actress Sri Sudha: విమానంలో వెకిలి చేష్టలు.. బొక్కలు విరగొట్టిన టాలీవుడ్ నటి

Actress Sri Sudha: ఏ మనిషికైనా సహనం కొంత పరిధి వరకే ఉంటుంది. ఒకసారి ఆ సహనం కట్టలు తెంచుకున్నదంటే ఇక దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఎదుటి మనిషికి నోటితో చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు కూడా వినకుంటే..చేతితో చెప్పాల్సి ఉంటుంది. సరిగ్గా దీనినే అమలులో పెట్టారు టాలీవుడ్ నటి శ్రీ సుధ. ఇటీవల తాను విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎదురైన సంఘటన, దాని తాలూకు అనుభవాలను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

శ్రీ సుధ మరెవరో కాదు. టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి, సరిలేరు నీకెవ్వరు, రూలర్, వలయం, వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి, వంటి చిత్రాల్లో నటించింది. ఇటీవల తాను వ్యక్తిగత పనిమీద వేరే ప్రాంతానికి వెళ్ళింది. తిరిగి వచ్చే క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న విమానంలో వెనకాల కూర్చున్న ఓ ప్రయాణికుడు తన రెండు కాళ్ళను ఆమె సీటుకు దగ్గరగా పెట్టాడు. పదేపదే తన కాళ్ళను ఆమెకు ఆనించే ప్రయత్నం చేశాడు. ఆమె మర్యాదగా రెండుసార్లు చెప్పింది. అయినప్పటికీ అతడు తన తీరు మార్చుకోలేదు. ఇదే విషయాన్ని విమానయాన సంస్థ దృష్టి కూడా తీసుకెళ్లారు. వారు కూడా పట్టించుకోకపోవడంతో ఆమె తన రెండు చేతులకు పని చెప్పింది.. సినిమా నటిగానే కాకుండా వ్యక్తిగతంగా ఫిజియోథెరపిస్ట్ ఆయన ఆమె తన బలాన్ని మొత్తం కూడా తీసుకొని అతడి రెండు కాళ్ళ మీద గట్టి కిక్ ఇచ్చింది. దెబ్బకు అతడు దారికి వచ్చాడు. ” నేను వ్యక్తిగత పనిమీద వేరే ప్రాంతానికి వెళ్లాను. తిరుగు ప్రయాణంలో ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది. రెండుసార్లు చెప్పాను అతడు వినిపించుకోలేదు.. ఇదే విషయాన్ని విమానయాన సంస్థ దృష్టి కూడా తీసుకెళ్లాను. వారు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో నా బలాన్ని మొత్తం కూడ తీసుకొని అతడికి ఒక గట్టి కిక్ ఇచ్చాను. నా పంచ్ దెబ్బకు అతడి కాళ్లు విరిగితే అది నా బాధ్యత కాదు.” అంటూ శ్రీ సుధ తన ఇన్ స్టా గ్రామ్ లో రాస్కొచ్చింది. అయితే ఆమె చేసిన పనిని కొంతమంది అభినందిస్తుండగా.. మరి కొంతమంది అలా చేసి ఉండాల్సింది కాదు అని కామెంట్ చేస్తున్నారు.

అన్నట్టు శ్రీ సుధ రెండు సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో పెద్ద సంచలనానికి కారణమయ్యారు. టాలీవుడ్ లో పేరుపొందిన సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు సోదరుడు శ్యామ్ కె నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపించింది. దీనికి సంబంధించిన కీలక ఆధారాలు బయట పెట్టింది. అయితే ఆమె మధ్యలో రాజీకి వచ్చారని తప్పుడు పత్రాలు సృష్టించిన పోలీస్ ఆఫీసర్ మీద కూడా కేసు పెట్టింది. ఈ వ్యవహారంలో ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, స్టిల్ ఫోటోగ్రాఫర్ సాయిరాం మాగంటి పేర్లు కూడా అప్పట్లో సంచలనమయ్యాయి. వీరిద్దరూ శ్యామ్ మీద పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని బెదిరించారని అప్పట్లో శ్రీ సుధ ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ లో ఉంది. అన్నట్టు శ్రీ సుధా ప్రస్తుతం గోపీచంద్ హీరోగా నటిస్తున్న భీమా అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular