
టాలీవుడ్ నటి ప్రగతి అంటే తెలియని వారుండరు.. తల్లి, అత్త క్యారెక్టర్లలో ఇమిడిపోయే ఈ ఏజ్ బార్ నటి తెలుగు సినిమాల్లో తరుచుగా కనిపిస్తుంటారు. ‘ఎఫ్3’లో విక్టరీ వెంకటేశ్ కు అత్తగా నటించి అలరించారు. ఇక సినిమాల్లో హోమ్లీగా కనిపించే ప్రగతి బయట మాత్రం కుర్రకారులా రెచ్చిపోతున్నారు.
స్టైలిష్ డ్రెస్సులు వేసుకుంటూ టైట్ జీన్సులు, టాప్స్ తో ప్రగతి యువతులను తలపించేలా ఎక్సర్ సైజులు చేసిన ఫొటోలు, వీడియోలు ఈ మధ్య కనువిందు చేస్తున్నాయి. అసలు సినిమాల్లో కనిపించే ప్రగతి ఈమెనా? అని బయట చూసిన వారు కూడా షాక్ అవుతున్నారు.
ఒద్దికగా కనిపించే ప్రగతి ఇలా ఆధునిక స్టైల్లో కనిపించేసరికి కుర్రకారు అంతా షేక్ అవుతున్నారు. ఇంకా అమ్మాయి అనుకుంటున్నావా? ‘ఆంటీ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వయసులోనూ ప్రగతి ఫిట్ నెస్ పై శ్రద్ధ చూశాక ఎవ్వరైనా ఆశ్చర్యపోక మానరు.
తాజాగా ప్రగతి ఆంటీ డ్యాన్స్ చేస్తూ ఉర్రూతలూగించింది. ప్రగతి యేనా ఈ డ్యాన్స్ చేసింది అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తన స్నేహితురాలితో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశారు నటి ప్రగతి.
https://www.instagram.com/p/COP2UEijQ92/?utm_source=ig_web_copy_link