
కరోనా సెకండ్ వేవ్ తో భారత్ పోరాడుతున్నది. పెద్ద ఎత్తున జనం మహమ్మారి బారినపడడంతో ఆసుపత్రుల్లో బెడ్లు లేక, ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో భారత్ కు అంతర్జాతీయంగా సహకారం కొనసాగుతున్నది. ఇప్పటికే అమెరికా, రష్యా, ఫ్రాన్స్ సహా పలు దేశాలు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఐర్లాండ్ సైతం భారత్ కు 700 యూనిట్ల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 365 వెంటిలేటర్లతో కూడిన కార్గో విమానం ఢిల్లీకి చేరింది. యూరోపియన్ భాగస్వామి, స్నేహితుడికి మద్దుతు విలువైనది అని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరవిందం బాగ్చి ట్వీట్ చేశారు.