Pooja Hegde: స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆమె బ్రదర్ వివాహం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని పూజ హెగ్డే సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. నవదంపతులతో తాను దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అలాగే ఓ ఎమోషనల్ నోట్ పంచుకున్నారు. ఇదో అద్భుతమైన క్షణం. నా కళ్ళలో ఆనందభాష్పాలు వచ్చాయి. చిన్న పిల్లలా నవ్వుతున్నాను. అన్నయ్య తన జీవితంలో మరో దశలో అడుగుపెట్టారు. అన్న వదినల కాపురం సుఖసంతోషాలతో నిండాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ… ప్రేమ, అభిమానం చూపుతూ వారి ప్రయాణం సాగాలి. మా కుటుంబంలోకి వదినకు స్వాగతం… అంటూ పూజ హెగ్డే సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు.

ఇక అన్నయ్య పెళ్లి వేడుకలో పూజా పట్టు చీర కట్టారు. ట్రెడిషనల్ వేర్ ధరించి వివాహ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అన్నయ్య పెళ్లి చేసిన పూజాను మీ వివాహం ఎప్పుడని ఫ్యాన్స్ అడుగుతున్నారు. కాగా ఇటీవల పూజ మీద పెళ్లి పుకార్లు ఎక్కువయ్యాయి. అధికారిక ప్రకటన మాత్రం లేదు. అన్నయ్య వివాహం కూడా జరిగిపోగా నెక్స్ట్ ఆమె పెళ్లి పీటలు ఎక్కుతారేమో చూడాలి.
ప్రస్తుతం పూజా రెండు భారీ ప్రాజెక్ట్స్ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. మహేష్ బాబుకి జంటగా ఎస్ఎస్ఎంబి 28 చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూట్ తిరిగి ప్రారభంభమైంది. ఇది పూజకు మహేష్ తో రెండో చిత్రం. గతంలో సూపర్ హిట్ మూవీ మహర్షి లో పూజ-మహేష్ జతకట్టారు. ఇక త్రివిక్రమ్ తో వరుసగా మూడో చిత్రం. అరవింద సమేత వీర రాఘవ చిత్రం నుండి త్రివిక్రమ్ ఆమెకు వరుస ఆఫర్స్ ఇస్తున్నారు.

అలాగే సల్మాన్ కి జంటగా కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రం చేస్తున్నారు. ఇటీవల చిత్ర టీజర్ విడుదల చేశారు. ఈ మూవీలో వెంకటేష్ కీలక రోల్ చేయడం విశేషం. పూజ హెగ్డే వెంకటేష్ చెల్లిగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతుంది. రంజాన్ కానుకగా కిసీ కా భాయ్ కిసీ కి జాన్ విడుదల కానుంది. కాగా గత ఏడాది పూజాకు బ్యాడ్ టైం నడిచింది. ఆమె నటించిన చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. ఆచార్య, రాధే శ్యామ్, సర్కస్ ఆల్ టైం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో ఆమెకు ఓ భారీ హిట్ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.