Actress Meena Husband Passed Away: అలనాటి అందాల నటి మీనా. చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటించి తన కెరీర్ ను మలుచుకుంది. ‘సిరివెన్నెల’ సినిమాలో అంధురాలిగా నటించి అందరిని మెప్పించింది. ఇంకా పలు సినిమాల్లో కూడా తనదైన నటనతో అందరిని అబ్బురపరచింది. అగ్రహీరోలందరితో సినిమాలు చేసి శభాష్ అనిపించుకుంది. దృశ్యంలో ఆమె నటనకు అందరు ఫిదా అయ్యారు. అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మీనాకు వైదవ్యం మిగిలింది. ఆమె భర్త విద్యాసాగర్ కన్నుమూశారు. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

మీనా భర్త కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన ఊపిరితిత్తులు పాడైపోయాయి. గతంలో కరోనా బారిన పడిన మీనా భర్త అతికష్టం మీద కోలుకున్నారు. అయితే ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ తగ్గలేదు. అదే ఊపిరితిత్తుల వ్యాధితో మంచానికే పరిమితమయ్యారు. ఆయన కోలుకోవాలంటే ఎవరైనా ఊపిరితిత్తులు దానం చేయాల్సి ఉంది. కానీ ఆయనకంటే ముందే ఎంతో మంది దరఖాస్తులు చేసుకున్న నేపథ్యంలో విద్యాసాగర్ కు ఊపిరితిత్తులు అమర్చడం వీలు కాలేదు. ఎవరైనా బ్రెయిన్ డెడ్ కేసు వస్తే వారి అవయవాల దానానికి ఒప్పుకుంటేనే ఊపిరితిత్తులు తీసుకోవడానికి వీలవుతుంది. అందుకే వారు దరఖాస్తు చేసుకున్నా కుదరలేదు.
‘పావురాల’ విసర్జన గాలి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఆయనకు చికిత్సలు చేసినా కోలుకోలేదు. ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉండిపోవాల్సి వచ్చింది. మీనా భర్త మృతితో సినిమా లోకం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఊపిరితిత్తుల వ్యాధితో ఇన్నాళ్లు చావు బతుకుల మధ్య పోరాటం చేసిన మీనా భర్త చివరకు కన్ను మూశారు. మీనాను సినీ ప్రముఖులు అంతా ఓదారుస్తున్నారు. చిన్న వయసులోనే ఎంత కష్టమొచ్చిందని తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఊపిరితిత్తులు ఇచ్చే దాత దొరికితే విద్యాసాగర్ బతికేవాడే. కానీ డోనర్ దొరకడం కష్టంగా మారింది. ఈ దశలో ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది. తాజాగా ఆరోగ్యం విషమించడంతో వైద్యులు కూడా ఏం చేయలేకపోయారు. చివరకు ఆయన తుది శ్వాస విడిచారు. మీనాకు తీరని శోకాన్ని మిగిల్చారు. మీనా భర్త మృతికి సినిమా పరిశ్రమ మొత్తం తమ సంతాపం వ్యక్తం చేసింది.
Also Read:Megastar Chiranjeevi: మెగాస్టార్ తో క్రేజీ కాంబినేషన్స్.. లిస్ట్ చూస్తే షేకే




[…] Also Read: Actor Meena Husband Passed Away: నటి మీనా భర్త ఆకస్మిక మృత… […]