Krishnam Raju Passed Away: రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు.. హైదరాబాద్ లో ఈ రోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కృష్ణంరాజు పనిచేశారు. ఏపీ నుంచి ఎంపీగా గెలిచారు.

గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరమవదించారు. రేపు ఉదయం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జన్మించారు. కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
1966లో ‘చిలకా గోరింక’ చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించారు. 187కు పైగా చిత్రాల్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించారు. కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణరాజు కుమారుడే మన స్టార్ హీరో ప్రభాస్.

వాజపేయీ కేబినెట్ లో కేంద్రమంత్రిగా పనిచేసిన కృష్ణంరాజు.. 2009లో ప్రజారాజ్యంలో చేరారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నా.. అనారోగ్యం కారణంగా యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
[…] […]