Geeta Singh: బ్రేకింగ్: నటి గీతా సింగ్ ఇంట్లో ఊహించని విషాదం… ప్రమాదంలో!

Geeta Singh: నటి గీతా సింగ్ ఇంట్లో దారుణ విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో గీతా సింగ్ కుమారుడు చనిపోయినట్లు సమాచారం అందుతుంది. గీతా సింగ్ కొడుకు బైక్ పై ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గీతా సింగ్ కి పెళ్లి కాలేదు. తన సోదరుడు పిల్లలను దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు. ఇద్దరు కుమారుల్లో పెద్దబ్బాయి మరణించినట్లు సమాచారం. గీతా సింగ్ కొడుకు మరణవార్త తెలుసుకున్న చిత్ర […]

Written By: Shiva, Updated On : February 18, 2023 9:53 am
Follow us on

Geeta Singh

Geeta Singh: నటి గీతా సింగ్ ఇంట్లో దారుణ విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో గీతా సింగ్ కుమారుడు చనిపోయినట్లు సమాచారం అందుతుంది. గీతా సింగ్ కొడుకు బైక్ పై ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గీతా సింగ్ కి పెళ్లి కాలేదు. తన సోదరుడు పిల్లలను దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు. ఇద్దరు కుమారుల్లో పెద్దబ్బాయి మరణించినట్లు సమాచారం. గీతా సింగ్ కొడుకు మరణవార్త తెలుసుకున్న చిత్ర ప్రముఖులు, సన్నిహితులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

గీతా సింగ్ కొడుకు మృతి చెందిన సమాచారం నటి కరాటే కళ్యాణి తెలియజేశారు. ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక సందేశం పోస్ట్ చేశారు. ”కారు, బైక్ మీద ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లలు జాగ్రత్తగా ఉండండి. గీతా సింగ్ కొడుకు ప్రమాదంలో మృతి చెందాడు’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో ఏ విషాదం వెలుగులోకి వచ్చింది.

నిజామాబాద్ కి చెందిన గీతా సింగ్ నటిగా పరిశ్రమలో అడుగుపెట్టారు. సీనియర్ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గీతా సింగ్ ని సినిమాల్లో ప్రోత్సహించారు. ఎవడు గోల వాడిది మూవీలో గీతా సింగ్ కి మంచి పాత్ర ఇచ్చారు. ఆ చిత్రంతో ఆమె వెలుగులోకి వచ్చారు. కితకితలు మూవీలో గీతా సింగ్ హీరోయిన్ గా నటించడం విశేషం. అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు సూపర్ హిట్ అయ్యింది. వందకు పైగా చిత్రాల్లో గీతా సింగ్ లేడీ కమెడియన్ రోల్స్ చేశారు.

Geeta Singh

కొన్నాళ్లుగా ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా చుట్టుముట్టాయి. సినిమాలతో సంపాదించిన కొంత డబ్బు మోసం చేసి కొందరు లాగేసుకున్నారని ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో వాపోయారు. పెళ్లి చేసుకోకుండా సోదరుడు పిల్లలను దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు. వారిలో ఒకరు ఇలా ప్రమాదంతో ఆమెకు దూరమయ్యారు. కష్టాల్లో ఉన్న ఆమెకు కొడుకు మరణంతో మరింత ఆవేదన మిగిలింది.

 

Tags