https://oktelugu.com/

Actor Ali: ఇక సెలవు…. నటుడు ఆలీ షాకింగ్ డెసిషన్.!

Actor Ali: తెలుగులో బాగా పాపులర్ అయిన టాక్ షో ఆలీతో సరదాగా. సిల్వర్ స్క్రీన్ పై ఆలీ జోరు తగ్గాక ఆయన బుల్లితెర ఈవెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అలా ప్రయోగాత్మకంగా 2016లో జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ‘ఆలీతో సరదాగా’ షో ప్రారంభమైంది. 2016 అక్టోబర్ 24న గ్రాండ్ గా లాంచ్ చేశారు. మోహన్ బాబు గారి అమ్మాయి మంచు లక్ష్మి మొదటి గెస్ట్. ఆమె బోణీ అదిరింది. గత ఏడేళ్లుగా షో నిర్విరామంగా కొనసాగుతుంది. నటులు, […]

Written By: , Updated On : December 17, 2022 / 09:08 AM IST
Follow us on

Actor Ali: తెలుగులో బాగా పాపులర్ అయిన టాక్ షో ఆలీతో సరదాగా. సిల్వర్ స్క్రీన్ పై ఆలీ జోరు తగ్గాక ఆయన బుల్లితెర ఈవెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అలా ప్రయోగాత్మకంగా 2016లో జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ‘ఆలీతో సరదాగా’ షో ప్రారంభమైంది. 2016 అక్టోబర్ 24న గ్రాండ్ గా లాంచ్ చేశారు. మోహన్ బాబు గారి అమ్మాయి మంచు లక్ష్మి మొదటి గెస్ట్. ఆమె బోణీ అదిరింది. గత ఏడేళ్లుగా షో నిర్విరామంగా కొనసాగుతుంది. నటులు, దర్శకులు, నిర్మాతలు, సింగర్స్ ఇలా పరిశ్రమకు చెందిన పలువురు ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పీవీ సింధు వంటి స్పోర్ట్స్ గర్ల్ ని కూడా ఆలీ ఇంటర్వ్యూ చేశారు.

Actor Ali

Actor Ali

ఒకప్పుడు వెండితెరపై వెలిగి కనుమరుగైన నటులను తేవడం ఆలీతో సరదాగా షోకి ఉన్న ప్రత్యేకత. ఈ విషయం ఆడియన్స్ ని బాగా అలరించింది. అప్పటి స్టార్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు. వారి ఫ్యామిలీ, లైఫ్ స్టైల్ ఏమిటీ? ఎక్కడ ఉన్నారు? అనే విషయాలు ఆలీ చక్కగా రాబడతారు. అలాగే వారి జీవితంలోని చాలా అరుదైన విషయాలు సేకరించి అడుగుతారు ఆలీ.

ఈ షో అభిమానులు ప్రత్యేకంగా ఆలీకి విజ్ఞప్తులు చేస్తారు. ఫలానా గెస్ట్ ని తీసుకురండి. ఆయన్ని లేదా ఆవిడను ఇంటర్వ్యూ చేయండని కోరుకుంటారు. అంతగా ఆలీతో సరదాగా షోని ఒక వర్గం ఫాలో అవుతూ ఉంటారు. ఈటీవీలో ప్రసారమయ్యే షోలలో మంచి టీఆర్పీ సాధించే షోగా ఆలీతో సరదాగా ఉంది. డిసెంబర్ 12 ఎపిసోడ్లో బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, రాహుల్ సిప్లిగంజ్ లను అలీ ఇంటర్వ్యూ చేశారు. అయితే 315వ ఎపిసోడ్ కి ఆయనే గెస్ట్ గా వచ్చాడు.

Actor Ali

Actor Ali

స్టార్ యాంకర్ సుమ ఆయన్ని ఇంటర్వ్యూ చేసింది. ఆయన కెరీర్ బిగినింగ్ నుండి ఆసక్తికర విషయాలు రాబట్టింది.కాగా ఆలీతో సరదాగా టాక్ షోకి చరమగీతం పాడారు అంటున్నారు. ఈ షో ఇకపై ఉండదు అట. అందుకే ఫైనల్ ఎపిసోడ్లో అలా టచ్ ఇచ్చారనేది టాక్. కారణాలు ఏవైనా ఆలీతో సరదాగా షో ఆపేస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఇది ఒకింత అభిమానులను నిరాశపరిచే అంశమే. ఆలీ హీరోగా ఇటీవల అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే సినిమా నేరుగా ఓటీటీలో విడుదలైంది.

Tags