ABN RK – Jagan: ఆ ఎమ్మెల్యేకు ఏబీఎన్ రాధాకృష్ణ ఎఫెక్ట్ పడింది. ఇంటర్వ్యూ ముగియగానే కిడ్నాప్ కేసు బుక్కయ్యింది. అదేంటి ఇంటర్యూకు చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్తారు కదా. ఈయన పైనే ఎందుకు కేసు బుక్కయింది అనుకుంటున్నారా ? అవును. ఇంటర్వ్యూకి వెళ్లింది టీడీపీ ఎమ్మెల్యేనో.. ఇంకో ఎమ్మెల్యేనో కాదు. సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే. అది కూడా జగన్ ను ధిక్కరించిన వైసీపీ ఎమ్మెల్యే. ఇక జగన్ చూస్తూ ఊరుకుంటాడా.. చెయ్యాల్సినదంతా చేసెయ్యడూ.

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై కిడ్నాప్ కేసు నమోదైంది. ఇప్పటికే వైసీపీ పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసి టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలోని కొందరు నేతలే కోటంరెడ్డి వైపు మొగ్గుచూపుతున్నారు. మరికొందరు వైసీపీలో కొనసాగేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన 22వ డివిజన్ కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి తన కార్యాయంలోని కోటంరెడ్డి ఫ్లెక్సీలను చింపారు. దీంతో కోంటరెడ్డి శ్రీధర్ రెడ్డి తన అనుచరులతో విజయ భాస్కర్ రెడ్డి ఇంటి పై దాడి చేశారని, కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని కేసు నమోదైంది. విజయభాస్కర్ రెడ్డి ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. కోటంరెడ్డితో పాటు ఆయన అనుచరులు మిద్దె మురళీకృష్ణయాదవ్, అంకయ్య పై పోలీసులు కేసు నమోదు చేశారు.
కోటంరెడ్డి పై కేసు నమోదు చేయడం వెనుక మరోకారణం కనిపిస్తోంది. ఇటీవల కోటంరెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఇంటర్వ్యూకు వెళ్లారు. ఆ ఇంటర్వ్యూ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంకా పూర్తీస్థాయి ఇంటర్వ్యూ విడుదల కాలేదు. వైసీపీ పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశాక కూడా అధిష్ఠానం చూసీచూడనట్టు ఉంది. కానీ ఏబీఎన్ ఇంటర్వ్యూకు కోటంరెడ్డి వెళ్లడంతో ఎక్కడ కాలాలో అక్కడ కాలిందని తెలుస్తోంది. అందుకే హుటాహుటిన కోటంరెడ్డి పై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఏబీఎన్ ఇంటర్వ్యూ సందర్భంగా కోటంరెడ్డి పలు విషయాలు ప్రస్తావించినట్టు తెలిసింది. ఇవి కచ్చితంగా జగన్ ను ఇబ్బంది పెట్టే విధంగా ఉండనున్నాయి. దీంతో ఆఘమేఘాల పై అధికారులకు కేసు నమోదు చేయడానికి ఆదేశాలు అందాయట. స్ట్రిప్టులో భాగంగా కార్పొరేటర్ తో ఆరోపణలు చేయించి.. ఫిర్యాదు చేయించారట.
వైసీపీ నుంచి బయటికి వస్తున్న తరుణంలోనే కోటంరెడ్డి స్పష్టత ఇచ్చారు. ఇక నుంచి తన పై కేసులు నమోదువుతాయని, జైళ్లో వేస్తారని చెప్పుకొచ్చారు. కేసులు పెట్టినా, జైళ్లో వేసినా.. తన గొంతు ఆగదని చెప్పారు. ఎన్ కౌంటర్ చేస్తే తప్ప తన గొంతు ప్రశ్నించడం ఆగదని కోటంరెడ్డి స్పష్టం చేశారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తన పై కేసు నమోదు చేస్తారని కోటంరెడ్డి ముందే తెలియజెప్పారు. ఇప్పుడు నమోదు చేసిన కేసులు కోటంరెడ్డి ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. ఇక మరో ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి పై ఎలాంటి చర్యలకు పూనుకుంటారో చూడాలి.

వైసీపీ అధినేత జగన్ తన పై ఆరోపణలు చేస్తే సహించలేరని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ప్రతిపక్షాల మాటలను జగన్ నిజం చేస్తున్నారని అనుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ చేశారని సొంత ఎమ్మెల్యే ఆరోపించినప్పుడు.. నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. కానీ అలా చేయకుండా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటే.. ఫోన్ ట్యాపింగ్ చేసిన మాట వాస్తవమనే కదా అర్థం. ప్రత్యర్థుల నోళ్లను తన సమాధానాలతో మూయించాలి కానీ జైళ్లు, కేసులతో కాదన్న సత్యాన్ని జగన్ గ్ర
హించాలి.