ABN RK Saipallavi: చిరంజీవితో అందుకే చేయలేదా? సాయిపల్లవితో ఈ వేశాలేంటీ ఆర్కే..!

ABN RK Saipallavi: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ పేరు చెబితే రాజకీయ పార్టీలకు హడల్. ఆయనతో ఇంటర్వ్యూ అంటేనే రాజకీయ నేతలంతా తటపటాయిస్తారు.కేసీఆర్ నుంచి షర్మిల వరకూ అందరినీ కూర్చుండబెట్టి చమటలు పట్టించిన ఘనత ఆర్కే సొంతం. ఇటు తిప్పి అటు తిప్పి నేతలను తికమక పెట్టి ఎలాగోలా నిజాలు రాబడుతారు. అలాంటి ఆర్కే తాజాగా చిన్న పిల్లోడు అయిపోయాడు. గ్లామర్ హీరోయిన్ సాయిపల్లవితో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ఇంటర్వ్యూ నిర్వహించి సరదాగా […]

Written By: NARESH, Updated On : June 10, 2022 8:42 pm
Follow us on

ABN RK Saipallavi: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ పేరు చెబితే రాజకీయ పార్టీలకు హడల్. ఆయనతో ఇంటర్వ్యూ అంటేనే రాజకీయ నేతలంతా తటపటాయిస్తారు.కేసీఆర్ నుంచి షర్మిల వరకూ అందరినీ కూర్చుండబెట్టి చమటలు పట్టించిన ఘనత ఆర్కే సొంతం. ఇటు తిప్పి అటు తిప్పి నేతలను తికమక పెట్టి ఎలాగోలా నిజాలు రాబడుతారు. అలాంటి ఆర్కే తాజాగా చిన్న పిల్లోడు అయిపోయాడు. గ్లామర్ హీరోయిన్ సాయిపల్లవితో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ఇంటర్వ్యూ నిర్వహించి సరదాగా తన సహజశైలికి భిన్నంగా కుషల ప్రశ్నలు వేశాడు. ఒక్క చిరంజీవితో డ్యాన్స్ ఎందుకు చేయలేదన్న ప్రశ్న తప్పితే సాయిపల్లవితో మనసారా నవ్వుకునేలా ఆహ్లాదంగా మాట్లాడేశారు. చాలా రోజులకు కడుపుబ్బా నవ్వేశారు.

సాయిపల్లవి స్టార్ హీరోయిన్ అయినా సరే ఎంతో సాదాసీదా అమ్మాయిలా ఈ ఇంటర్వ్యూలో కనిపించింది. తన సింప్లిసిటీతో ఏబీఎన్ ఆర్కేలోని కరుడుగట్టిన జర్నలిస్ట్ ను కూడా మాయమైపోయేలా చేసింది. సాయిపల్లవి సోఫాపై తనకిష్టమొచ్చినట్టు కూర్చోమని ఆర్కే అని ఫిదా చేశాడు.దీంతో రెండు కాళ్లు సోఫాపై పెట్టి మనసారా సాయిపల్లవి కూర్చొని సమాధానాలు చెప్పింది.

తెలుగమ్మాయి లాగా కనిపించే సాయిపల్లవి తన ఇంట్లో కూడా అప్పుడప్పుడూ తెలుగులోనే మాట్లాడుతుందట.. తమిళనాడులోని మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా తెలుగుకు ఆమె గౌరవం ఇస్తుందట.. తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? అని కూడా వాళ్ల నాన్న సాయిపల్లవిని అడిగేశాడట.. 23 ఏళ్లకే పెళ్లి చేసుకుందామనుకున్నానని.. 30 ఏళ్లకు ఇద్దరు పిల్లలను కందామని అనుకున్నానని సాయిపల్లవి సీక్రెట్స్ బయటపెట్టింది.

పుట్టపర్తి సాయిబాబా దయవల్ల తాను పుట్టానని.. అందుకే సాయిపల్లవి అని పేరు పెట్టారని ఆమె చెప్పుకొచ్చింది. సినిమా కల్చర్ లో గ్లామర్ లో ఎన్నో వేశాలు ఉంటాయని.. అలాంటి వేధింపులు మీకు ఎదురుకాలేదా? అని ఆర్కే సరైన ప్రశ్ననే అడిగాడు. కానీ తాను ఉన్నట్టే ఉంటానని.. నచ్చితేనే సినిమా చేస్తానని ముందే కండీషన్ పెడుతానని.. లేకపోతే సినిమాను ఒప్పుకోనని సాయిపల్లవి కుండబద్దలు కొట్టింది.

ఇక చిరంజీవితో సినిమాలో డ్యాన్స్ చేసే అవకాశం వచ్చినా తాను ఆయన గ్రేస్, స్టార్ డంతో పోటీపడవద్దని వైదొలగానని నిజాన్ని ఒప్పుకుంది. చిరంజీవితో తాను అందుకే చేయలేదని నిజాన్ని రివీల్ చేసింది.

మొత్తంగా సాయిపల్లవితో ఇంటర్వ్యూ కాస్తా ఏదో సరదా గేమ్ ఆడిన చందంగా లాగించేశాడు మన ఆర్కే. అందరిలో సూటిపోటి.. నిఖార్సైన ప్రశ్నలు కాకుండా సరదాగా సాగిపోయేలా ఆహ్లాదాన్ని పంచాడు. సాయిపల్లివితో ఆర్కే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.