Aamir Khan: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గర్వించదగ్గ సూపర్ స్టార్స్ లో ఒకరు అమీర్ ఖాన్..అమీర్ ఖాన్ అనే బ్రాండ్ బాక్స్ ఆఫీస్ వద్ద వేలకోట్ల రూపాయిలు వసూలు చేసింది..ప్రపంచం లో పాత్ర కోసం ప్రాణాల్ని కూడా పణంగా పెట్టేంత చిత్తశుద్ధి ఉన్న అతికొద్ది మంది నటులలో అమీర్ ఖాన్ ఒకరు..ఆయన నటించిన దంగల్ సినిమా రికార్డ్స్ ని ఇప్పటి వరుకు బాలీవుడ్ లో ఒక్కరు కూడా బ్రేక్ చెయ్యలేకపోయారంటే అమీర్ ఖాన్ స్టార్ స్టేటస్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

అమీర్ ఖాన్ కెరీర్ లో అలాంటి సంచలనాత్మక చిత్రాలు ఒక 15 ఉంటాయి..అయితే దంగల్ తర్వాత అమీర్ ఖాన్ చేసిన ‘తగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలు అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు..ప్రస్తుతం ఆయన ఒక స్పానిష్ మూవీ రీమేక్ లో నటిస్తున్నాడు..ఇది ఇలా ఉండగా అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా తర్వాత చాలా కాలానికి ఒక ఇంటర్వ్యూ ద్వారా మీడియా ముందుకి వచ్చాడు.
ఈ సందర్భంగా అమీర్ ఖాన్ తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని విషాదకరమైన సంఘటనలు ఈ ఇంటర్వ్యూ లో పంచుకుంటూ కంటతడి పెట్టేసాడు..అమీర్ ఖాన్ తండ్రి తాహిర్ హుస్సేన్ బాలీవుడ్ లో ఒక బడా నిర్మాత..ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించాడు..అమితాబ్ బచ్చన్ , దిలీప్ కుమార్, రిషి కపూర్ ఇలా ఒక్కరా ఇద్దరా అప్పట్లో సూపర్ స్టార్స్ గా వెలుగొందిన అందరితో ఈయన సినిమాలు చేసాడు..వాటిల్లో ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో..అన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి..ఒకానొక్క సందర్భం లో అమీర్ ఖాన్ తన తండ్రి ఎదుర్కొన్న కష్టాలు..దాని వల్ల కుటుంబం మొత్తం ఎంత ఇబ్బంది పడిందో చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘అప్పట్లో మా నాన్న ‘లాకెట్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు..అందులో జితేంద్ర, రేఖ హీరో హీరోలు గా నటించారు..అప్పట్లో మా నాన్న పెద్ద నిర్మాత కాదు కాబట్టి డేట్లు సరిగా ఇచ్చేవాళ్ళు కాదు..దాంతో షూటింగ్స్ వాయిదా పడుతూ ఉండేవి..నాన్న అప్పులు చేసి పెట్టుబడులు మొత్తం ఆ సినిమా మీదనే పెట్టేసాడు..షూటింగ్ ఆలస్యం అవుతుండడం తో వడ్డీలు పెరిగిపోతూ ఉండేవి..అప్పులోళ్లు ఇంటికి వచ్చి గొడవ చేసేవారు..సినిమా విడుదలైతే డబ్బులు వస్తాయి..అప్పుడు వెంటనే ఇచ్చేస్తాను అని చెప్పినా కూడా వినేవారు కాదు..అలా మా కుటుంబం మొత్తం రోడ్డున పడింది..నాకు అప్పుడు పదేళ్ల వయసు ఉంటుంది..మా నాన్న పడే బాధని చూసి ఏమి చెయ్యలేని స్థితి లో నేను చిన్నతనం లోనే మానసికంగా చాలా కృంగిపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు అమీర్ ఖాన్.