Panjagutta Graveyard: మనిషికి వేపకాయంత వెర్రి వేయి రకాలుగా ఉంటుందట. అది మనిషికో తీరుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో ఓ యువతి తనను ప్రేమికుడు వదిలేశాడని ఏడుస్తోంది. ఇక నాకు దిక్కెవరు? అతడు లేని జీవితం వ్యర్థం. తాను ఆత్మహత్య చేసుకుంటానని పంజాగుట్ట శ్మశాన వాటికలో ఏడుస్తూ కూర్చుంది. దీంతో స్తానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. ఇలా యువతి చేసిన పనికి అందరు ఆశ్చర్యపోయారు.
ప్రేమికుడు వదిలేస్తే చాలే శరణ్యమా? అతడు లేకపోతే ఇక మనుషులే లేరా? ఇదెక్కడి పితలాటకం అని అందరు అవాక్కయ్యారు. ఇరవై ఏళ్లు పెంచిన తల్లిదండ్రులను కాదని ఎవడో గొట్టంగాడి కోసం ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడం గమనార్హం. అదే తల్లిదండ్రుల కోసం ఏమైనా చేస్తారా? చేయరు. పేరెంట్స్ అక్కర్లేదు. వయసు రాగానే తోడు కావాలి. అది నచ్చిన వాడు కావాలి.
ఇది నేటి యువత పరిస్థితి. ప్రేమించిన వాడి కోసం తనువు చాలించాలనే ఆలోచన వచ్చిన యువతి మరి తల్లిదండ్రుల కోసం ఏం వదులుకుంటుంది. తల్లిదండ్రుల పరువు తీయడానికే పుడతారు. అంతే కాని లవర్ తిట్టాడని, ప్రేమించిన వాడు వదిలేశాడని సెల్ టవర్లు ఎక్కి చస్తానని బెదిరించడం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. కన్నవారి కలల్ని కల్లలు చేసే ఇలాంటి వారికి ఎంత చెప్పినా అర్థం కాదు.
వయసు రాగానే తోడు కోసం తపించడం సహజం. కానీ అతడు వద్దన్నాడని ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి. అతడు లేకపోతే ప్రపంచమే లేదా? ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. కానీ ఆమెకు అతడే కావాలట. అతడితోనే జీవిస్తుందట. లేకపోతే జీవితమే లేదని చెప్పడం గమనార్హం. దీంతో పోలీసులు ఆమె తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. జీవితంలో ఎదిగేందుకు ప్రయత్నించాలి కానీ లవర్ కోసం కాదనే విషయం వీళ్లు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో?