Woman Was Found Chopped: అతడో కర్కోటకుడు. మొదటి భార్యను హత్య చేసి జైలుకు వెళ్లి వచ్చి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమెకు అన్ని విషయాలు చెప్పలేదు. మొదటి పెళ్లి విషయం దాచిపెట్టి పెళ్లాడాడు. మొదటి వివాహం గురించి తెలియడంతో రెండో భార్య నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో రెండో భార్యను సైతం హతమార్చాలని పథకం వేశాడు. అనుకున్నదే తడవుగా రాత్రి పూట డంబెల్ తో కొట్టి చంపి తరువాత ముక్కలుముక్కలుగా కోసం డ్రమ్ములో దాచాడు. తల్లిదండ్రులు వచ్చి చూడగా ఇంటికి తాళం వేసి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించడంతో విషయం బయటపడింది. తానే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

హఫీస్ పేటకు చెందిన సరోజ ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన అనిల్ కుమార్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. దీంతో అతి ప్రేమగా మారింది. దీంతో పెద్లలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు తొమ్మిది నెలలు వారి కాపురం సజావుగానే సాగింది. తరువాత గొడవలు చెలరేగాయి. అనిల్ కుమార్ కు ఇంతకుముందే వివాహం అయి నలుగురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. దీంతో సరోజ నిలదీసింది. దీనిపై ఇద్దరి మధ్య పెద్ద దుమారమే జరిగింది.
Also Read: Naga Chaitanya- Samantha: నాగ చైతన్య కోసం భారీ సినిమాని వదులుకున్న సమంత
దీంతో కోపోద్రిక్తుడైన అనిల్ కుమార్ భార్యను ఎలాగైనా చంపేయాలని పథకం వేశాడు. ఆమె పడుకున్న సమయంలో డంబెల్ తో కొట్టి చంపాడు. తరువాత ఆమె దేహాన్ని ముక్కలుగా కోసం డ్రమ్ములో దాచాడు. తరువాత ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. జరిగిన గొడవను సరోజ తల్లిదండ్రులకు వివరించింది. మొదటి వివాహాన్ని గురించి తల్లిదండ్రులతో చర్చించింది. దీంతో వారు హైరానా పడి తెల్లారేసరికి ఇంటికి రాగా తాళం వేసి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు.

వారు వచ్చి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా సరోజ మృతదేహం కనిపించింది. ప్రేమించిన పాపానికి భార్యనే ముక్కలుగా చేసిన హంతుకుడు అనిల్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదటి భార్యను కూడా ఇలాగే అదనపు కల్నం కోసం వేధించి వాటర్ హీటర్ తో కొట్టి చంపి జైలు శిక్ష అనుభవించిన అనంతరం బయటకొచ్చి సరోజను వివాహం చేసుకున్నాడు. చివరకు ఆమెను కూడా హత్య చేసి తనలోని రాక్షసుడున్నాడని చాటిచెప్పాడు.
Also Read: Ram Charan Driver Birthday Celebrations: రామ్ చరణ్ గొప్పోడబ్బా… డ్రైవర్ కోసం ఏం చేశాడో చూడండి!
[…] […]
[…] […]