Prakasam District: వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రియురాలే ఆయనకు శత్రువుగా మారింది. మనస్పర్థల కారణంగా ఈ ఘాతుకానికి పాల్పడింది. పదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళే ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసింది. దీంతో తీవ్రగాయాలపాలైన ప్రియుడు ఆస్ప్రత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది ఈ ఘాతుకం.

Also Read:
Musi River: మూసి నదిలో ప్రమాదకర లెడ్.. ఆ ఒడ్డునే కూరగాయలు.. ఎట్లా తినేది?
ప్రకాశం జిల్లా కొండెపి మండలం మూగచింతల గ్రామంలో 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 55 సంవత్సరాల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత పదేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తోంది. అయితే ఇటీవల వారిద్దరి మధ్య ఆర్థికపరమైన విభేదాలు వచ్చాయి. వాటికి ఇతరత్రా సమస్యలు తోడయ్యాయి. దీంతో ప్రియుడి అడ్డు తొలగించుకోవాలని సదరు మహిళ నిర్ణయించుకుంది. తన వద్దకు వచ్చిన ప్రియుడిని బ్లేడుతో దాడిచేసింది. మర్మాంగాన్ని కోసే ప్రయత్నంలో ప్రియుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధతో కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చారు. వెంటనే బాధితుడ్ని ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడిచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఐ రామక్రిష్ణ సదరు మహిళను అదుపులోకి తీసుకోని విచారణ చేపడుతున్నారు.

పెరుగుతున్న అకృత్యాలు..
ఇటీవల వివాహేతర సంబంధాల మాటున దారుణ ఆకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. నేరపూరిత చర్యలకు ప్రేరేపిస్తున్నాయి. ఇరు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. సమాజంలో వివాహేతర సంబంధాలు ఒక నేరమైతే దానికి మించి నేర ఘటనలకు కారణమవుతున్నాయి. పరస్పర దాడులు, ప్రతీకారాలకు బీజం వేస్తున్నాయి. వివాహేతర సంబంధాలు నడిపే ఇరు కుటుంబాలకు ఇవి శాపంగా మారుతున్నాయి. ఒక కుటుంబం బాధితులవుతుండగా… మరో కుటుంబంలో వ్యక్తులు నేరం చేసి కటకటాలపాలవుతున్నారు. ప్రకాశం జిల్లాలో ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసిన ఘటన ఇటువంటి కోవకు చెందినదే.
Also Read:Mrunal Thakur: అదృష్టం అంతా ఆ హీరోయిన్ దే… వరుస అవకాశాలు.. ఎగబడుతున్న నిర్మాతలు
[…] […]