Tomatoes From Dubai: టమాటా ధరల విషయంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. మొన్న దొంగతనాలు.. తర్వాత చేలల్లో దొంగలు.. ఇటీవల టమాటా లారీ లూటీ.. చేలకు సీసీ కెమెరాలతో సెక్యూరిటీ, బాడీగార్డుల నియామకం.. లాంటి ఘటనలు చూశాం. ఇక మీమ్స్‌కు అయితే కొదవే లేదు. పెరుగుతున్న టమాట ధరలపై ఆన్‌లైన్‌లో అనేక జోకులు, మీమ్స్, సెటైర్స్ కనిపిస్తున్నాయి. టమాట కొనాలంటే ఒకటికి రెండుసార్లు కొనాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఓ మహిళ ఎవరూ చేయని పని చేసింది. దుబాయ్ నుంచి టమాటాలు దిగుమతి చేసుకుని ఆశ్చర్చపర్చింది.
సాధారణంగా దుబాయ్ నుంచి వచ్చేవారు బంగారం, ఆర్నమెంట్స్ తెచ్చుకుంటారు. ఎందుకంటే అక్కడ బంగారం ధర తక్కువగా ఉంటుంది. అయితే ఓ మహిళ దేశంలో టమాటా ధర సెంచరీ దాటిందని దుబాయ్ నుంచి 10 కిలోల టమాటాలు తెప్పించుకోవడం వైరల్‌గా మారింది.
భగ్గుమంటునన ధర..
టమాట ధరలు భగ్గుమంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో టమాటా ధర రూ.250 కి చేరింది. చాలాచోట్ల రూ.100 పైనే కిలో పలుకుతోంది. ఇలాంటి పరిస్థితిలో సామాన్యులు టమాటా కొనడం తీవ్రమైన భారమైపోయింది. టమాటా ధరలు ఎప్పుడు దిగొస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఇంకొన్నాళ్లు ఇదే పరిస్థితి ఉండొచ్చు.
బంధువలుతో విదేశాల నుంచి
విదేశాల నుంచి వచ్చే తమ కుటుంబ సభ్యులు, బంధువులతో టమాటాలు తెప్పించుకునే పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు అలాంటి ఘటన చర్చనీయాంశమైంది. ఓ మహిళ తన కూతురుతో విదేశాల నుంచి 10 కిలోల టమాట తెప్పించుకోవడం ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. రేవ్స్ అనే యూజర్ ట్విట్టర్‌లో ఈ పోస్ట్ చేశారు. తన సోదరి దుబాయ్ నుంచి ఇండియాకు సెలవులు గడిపేందుకు వస్తున్నారని, దుబాయ్ నుంచి ఏమీ తీసుకురావాలని అని అడిగితే, 10 కిలోల టమాట తీసుకురావాలని మా అమ్మ చెప్పారని ట్వీట్ చేశారు. దీంతో సూట్‌కేస్‌లో 10 కిలోల టమాటలు తీసుకొని తన సోదరి వచ్చారని వివరించారు.
ఎక్కువగా వాడకం..
వాళ్ల ఇంట్లో టమాటలు ఎక్కువగా వాడుతుంటారని, చట్నీ దగ్గర్నుంచి కూరగాయల వరకు టమాట ఎక్కువగా ఉపయోగిస్తామని సదరు యూజర్ చెప్పారు. ట్విట్టర్‌లో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ట్విట్టర్ యూజర్లు ఈ పోస్ట్‌పై సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
ఆసక్తికరమైన వార్తలు..
ఇక టమాటా చుట్టూ అనేక ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. పూణెకు చెందిన ఓ రైతు టమాటలు అమ్మి నెల రోజుల్లోనే కోటీశ్వరుడు అయిపోయాడన్న వార్త కూడా వైరల్‌గా మారింది. ధరలు భారీగా పెరిగిన ఈ టైమ్‌లో ఆయన తన పొలంలో టమాటలు బాగా పండించడం కలిసివచ్చింది. మరోవైపు టమాటా ధరలు భారీగా పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి సబ్సిడీ ధరకే టమాటాలు అమ్ముతోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో కిలో టమాట రూ.80 కే అమ్ముతుండటం విశేషం.