Bath On Bike: ఈ మధ్య కాలంలో ఏదో రకంగా వార్తల్లో నిలవాలని చూస్తున్నారు. ఏం చేసినా జనంలో పేరు రావాలని ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఏదో తాము గొప్ప విషయం కనిపెట్టామనే ఉద్దేశంతో ఉంటున్నారు. కానీ ప్రజల్లో పలుచన అయిపోతున్నామనే భావం వారికి ఉండటం లేదు. దీంతో వారి బాగోతం సమంజసంగా లేదని అందరు విమర్శిస్తున్నారు. ప్రజలకు అడ్డంకులు సృష్టించే ఇలాంటి దురాగాతాలను ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు.
కాన్పూర్ లో..
తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ నగరంలో ఓ ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వర్షం వచ్చింది. దీంతో వారు బట్టలు విడిచి సబ్బుతో స్నానం చేస్తూ వెళ్లడంతో అందరు కంగుతిన్నారు. వారు చేసిన పని అందరిలో అసహ్యం కలిగించింది. దీనిపై అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు చేసిన పనికి అందరు తిట్టిపోశారు. ఇదేం పైశాచికత్వం రా దేవుడా అంటూ హేళన చేశారు.
బాత్ రూం లేదా?
వారికి బాత్ రూం లేదా? ఆరుబయట స్నానం చేయడానికి వారేమైనా జంతువులా? మనుషులా? అని సెటైర్లు వేస్తున్నారు. జంతువులు కూడా ఇలాంటి వింత పనులు చేయవు. మనుషులకు ఉండాల్సిన విచక్షణ లేకపోతే ఇలాగే జరుగుతుంది. నాగరికత ముసుగులో మన వారు పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. వర్షంలో స్నానం చేయాలనే కోరిక ఉంటే ఇంట్లో చేయాలి తప్ప బయట చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
చర్యలు తప్పవు
దీనిపై ట్రాఫిక్ డీసీసీ రవీనా త్యాగి స్పందించారు. వారిని గుర్తించి వారిపై పబ్లిక్ న్యూసెన్స్ కేసు పెడతామని చెబుతున్నారు. జనానికి ఇబ్బందులు కలిగించిన వారు ఎంతటివారైనా శిక్షార్హులే. నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో ఆ యువకులు చేసిన పనికి నెటిజన్లు పలు కోణాల్లో పోస్టులు పెడుతున్నారు. వారి నిర్వాకాన్ని తూర్పారపడుతున్నారు.
