https://oktelugu.com/

Tiger: పులి వేట దగ్గరుండి చూశారు.. జీపులో గజగజ వణికి పోయారు

సరిగా పై అనుభవమే ఇటీవల కొంతమంది పర్యాటకులకు ఎదురైంది. మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోకి కొంతమంది పర్యాటకులు సందర్శన నిమిత్తం వెళ్లారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 14, 2024 / 12:28 PM IST

    Tiger

    Follow us on

    Tiger: పులికి పులి ఆకలి తీరినప్పుడు అడవి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే పులికి ఆకలిగా ఉంటే అడవి కూడా పస్తులు ఉంటుంది. విక్రమ్ సినిమాలో ఓ డైలాగ్ ఇది. సేమ్ ఆ డైలాగ్ మాదిరే అడవిలో పరిస్థితులు ఉంటాయి. పులికి ఆకలి వేస్తే అడవి మొత్తం విస్తృతంగా తిరుగుతుంది. ఎదురైన జంతువు మీద పడిపోయి ఆకలి తీర్చుకుంటుంది. గొంతులో తన పదునైన దంతాలతో అదిమిపడుతుంది. పంజా దెబ్బను ఒక్కసారిగా రుచి చూపించి దెబ్బకు మట్టి కరిచేలా చేస్తుంది. ఎంత పెద్ద జంతువునైనా నోట కరుచుకుని వెళ్లిపోతుంది. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతాల్లోకి తీసుకెళ్లి ఆ జంతువు మాంసాన్ని ఆరగిస్తుంది. ఆ తర్వాత గుహలోకి వెళ్లి పడుకుంటుంది.

    సరిగా పై అనుభవమే ఇటీవల కొంతమంది పర్యాటకులకు ఎదురైంది. మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోకి కొంతమంది పర్యాటకులు సందర్శన నిమిత్తం వెళ్లారు. వారు జీపులో ఉండి ఆ అడవిని మొత్తం ఖాళీగా తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే వారికి ఒక పులి కనిపించింది. అది వారి వాహనం ఉన్న సమీప ప్రాంతంలో కాలువలో నక్కినక్కి కూర్చుని చూస్తోంది. కనీసం దాని శ్వాస శబ్దాన్ని కూడా బయటికి వినిపించకుండా ఉండేలా గోప్యత ప్రదర్శిస్తోంది. ఎదురుగా ఓ అడవి పంది పచ్చిక గడ్డిని మేస్తోంది. ఈ లోగానే ఒక్కసారిగా ఆ కాలువలో నుంచి పులి ఆ అడవి పంది మీద పడింది. తన కాళ్లతో ఆ అడవి పందిని అదిమి పట్టుకుంది. ఊపిరి ఆడకుండా చేసింది. తన పదునైన దంతాలతో ఒక్కసారిగా ఆ గొంతు మీద కొరికేసింది. రక్త మోడుకుంటూ అడవి పంది విలవిలలాడుతూ ప్రాణాలు వదిలింది. ఈ దృశ్యాన్ని ఆ జీపు లో ఉన్నవారు భయపడుకుంటూనే తమ ఫోన్లలో బంధించారు. కొందరైతే పులి వేటాడే దృశ్యాలను చూసి వణికిపోయారు.

    అయితే ఇటీవల జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను కొంతమంది ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోని చూసి చాలా మంది డిటిజన్లో ఆ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. పులిని అంత దగ్గరగా చూడటం ఒకెత్తయితే.. ఎదురుగా ఉన్న జంతువును వేటాటం మరొక ఎత్తు.. ఆ దృశ్యాన్ని అలా లైవ్ గా చూడటం ఒక అనుభూతి.. మీ ఆ ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.