Bangaram Girl: సోషల్ మీడియా వచ్చాక కొత్త ఒక వింతలా మారింది. ఎవరు ఏం చేసినా అది జనాల హృదయానికి హత్తుకుంటే వైరల్ చేస్తున్నారు. అది ఎంత సృజనాత్మకంగా చేస్తున్నారన్నదే చూస్తున్నాం.. చేసే వారు ఒడ్డు పొడువు ఉన్నారా? నల్లగా తెల్లగా ఉన్నారా? మంచి అందమైన మనుషులా? అని చూడడం లేదు. వారి ప్రతిభను మాత్రమే అందులో చూస్తున్నారు.

తాజాగా సోషల్ మీడియాను ‘బంగారం భామ’ షేక్ చేస్తోంది. ఎక్కడ నుంచి వచ్చిందో..? ఎలా వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు బంగార భామ ఓ ఊపు ఊపేస్తోంది. ‘బంగారం’ అంటూ తన ప్రియుడి కోసం పడే బాధను వ్యక్తపరుస్తోంది. బంగారం నువ్వు ఏం చేసినా.. తాగినా.. తందనాలు ఆడినా.. తన్నినా సరే నువ్వంటే నాకు ప్రాణం అని.. నీ కోసమే బతుకుతున్నానని ఆమె పడుతున్న ఆవేదన చూసి నెటిజన్లు నవ్వాలో ఏడ్వాలో తెలియక ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రియుడి కోసం ‘బంగారం’ అంటూ అమాయకంగా ఆమె అలా అంటుంటే అది నిజమో కాదో అర్థం కాని పరిస్థితి. బంగారం అంటూ ఈ బాలిక ఏడుస్తుంటే నిజంగానే ప్రియుడి కోసం అంతలా తపనపడుతోందా? లేక ఇదంతా సోషల్ మీడియాలో హైప్ కోసం చేసిందా? అన్నది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు.
ఇంతకీ ఆమె బంగారం ఎవరు అని అందరూ ఆరాతీస్తున్నారు. కొందరైతే ఒక నల్లటి వ్యక్తిని ముందు పెట్టి.. ఇతడే ఆమె బంగారం అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నల్లగా.. పొట్టిగా ఓ రకంగా ఉన్న యువకుడిని ఇతడే నా బంగారం అంటూ ఆమెచూపించేసింది.
ఇంతకీ ఈ ఇద్దరి మధ్య గొడవ ఎందుకొచ్చింది? ఆమెను ఆ యువకుడు ఎందుకు దూరంగా పెట్టాడు. అతడి కోసం ఈమె బంగారం అంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి ఎందుకు చంపుతోందన్నది ప్రశ్న.
బంగారం అంటూ ఆమె ఏడుస్తూ పెట్టిన వీడియోలు చూసి అందరూ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఓరేయ్ బంగారంగా.. ఎక్కడున్నావ్ రా.. అక్క ఏడుస్తోందిరా.. ఒక్కసారి వచ్చిపోరా బంగారంగా’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మొత్తంగా ‘బంగారం’ అంటూ ఆ యువతి ఏడుస్తూ అందరినీ అయితే నవ్విస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడీ బంగారమే ట్రెండ్ అవుతోంది.