Viral Video: కామన్ మెన్ ట్యాలెంట్‌ను బయట పెట్టడానికి సోషల్ మీడియా మంచి వేదికగా మారింది. ఎవరో గుర్తించాలి.. తన టాలెంట్ చూపే అవకాశం ఇవ్వాలి అనే రోజులు పోయాయి. సోషల్ మీడియా వేదికగా అనేక మంది తమ సత్తా చాటుకుంటున్నారు. రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఓవర్‌నైట్ స్టార్లుగా, హీరోలుగా మారిపోతున్నారు. చాలా మందికి అవకాశాలు సైతం వెతుక్కుంటూ వస్తున్నాయి.
చీరలో యువతి స్టంట్..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. చాలా మంది తమలోని నైపుణ్యాలను వెలుగులోకి తెచ్చుకుంటున్నారు. టాలెంట్ నిరూపించుకుంటున్నారు. గతంలో ఓ యువతి ౖ»ñ క్‌పై యోగా చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. యోగా డ్రెస్ వేసుకుని కొన్ని ఫీట్లు చేసింది. తాజాగా ఓ యువతి చీరలో బైక్‌పై స్టంట్ చేసింది. డ్రెస్ వేసుకుని స్టంట్ చేయడం అందరూ చేస్తారు. అలా చేస్తే వింత ఏముంటుంది అనుకున్న ఓ యువతి చీరలో కళ్లకు గంతలు పట్టుకుని బైక్‌పై స్టంట్ చేసింది.
రిస్కీ అయినా..
ఇందులో ఓ యువతి ఎరుపు రంగు చీరకట్టులో స్కూటీ వెనుక భాగంపై నిలబడింది. ఆ తర్వాత కళ్లకు గంతలు కట్టుకుంది. అందరూ చూస్తుండగానే ఒక్క ఉదుకున పైకి లేచి తలకిందులుగా తిరిగి నేతలపై నిటారుగా నిలబడింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టంట్ మాస్టర్ పోస్టు చేశాడు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అమ్మాయి ధైర్యాన్ని చాలా మంది మెచ్చుకుంటున్నారు. అభినందిస్తున్నారు.
లైక్స్, షేర్స్ కోసమే..
చాలా మంది యువత ఇటీవల లైక్స్, షేర్స్ కోసం రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ట్రెయినింగ్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఈ యువతి కూడా శిక్షణ తీసుకునే స్టంట్ చేసిట్లు కనిపిస్తోంది. లేకుంటే అంత ఫర్‌ఫెక్ట్‌గా చేసేది కాదు. కానీ చీరకట్టులో కళ్లకు గంతలు కట్టుకుని చేయడమే ఇక్కడ వెరైటీ. ఇప్పటికే ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు.