AP And Telangana BJP: తెలుగు రాష్ట్రాల్లో భారీ మార్పులకు బీజేపీ హైకమాండ్ శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తుంది. అటు ఏపీ ఇటు తెలంగాణకు కొత్త బీజేపీ అధ్యక్షులు రాబోతున్నట్టు సమాచారం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎన్నికల నిర్వహణ కార్యదర్శిగా ఈటల రాజేందర్, ఏపీ బీజేపీ అధ్యక్షులుగా పురందేశ్వరి నియమితులయ్యారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించారు. ఈమేకు సాయంత్రం అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. కాగా, ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉన్నారు.
సంజయ్, కిషన్‌రెడ్డి.. ఇద్దరూ సుముఖంగా లేరు..
అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ వైదొలగడానికి సుముఖంగా లేరని..అలాగే కిషన్‌రెడ్డి మళ్లీ రాష్ట్ర పగ్గాలు చేపట్టడానికి ససేమిరా అంటున్నట్టు తెలుస్తుంది. అయితే హైకమాండ్ ఆదేశిస్తే మాత్రం ఈ మార్పులు అమలు చేయాల్సి ఉంటుంది. వ్యక్తుల అభిప్రాయం కంటే పార్టీ ప్రయోజనాల కోసం అధిష్టానం ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉండగా.. ఆయనను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోవాలనే భావనలో ఉన్నట్టు తెలుస్తుంది.
నడ్డాతో సంజయ్ భేటీ..
ఇక ఇప్పటికే ఢిల్లీలో పర్యటిస్తున్న బండి సంజయ్ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నాయకత్వ మార్పు అవసరమని.. అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని బండికి నడ్డా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఢిల్లీలో మీ అవసరాలను వాడుకుంటామని జేపీ నడ్డా హామీ ఇచ్చారని సమాచారం.
‘బండి’పై అసంతృప్తి..
ఇదిలా ఉండగా తెలంగాణలో బండి సంజయ్ నాయకత్వంపై కొందరు నేతలు గుర్రుగా ఉన్నారు. అధ్యక్షుడిని మార్చాలని ఎప్పటి నుంచో అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. మూడేళ్ల పదవీ కాలం ముగిసినందున మార్చడమే మంచిదని అధిష్టానం కూడా భావించింది. అదే సమయంలో కిషన్‌రెడ్డి వివాదరహితునిగా పేరుంది. దీనితో కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే పార్టీలో తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొస్తారని హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఏపీలో సోము వీర్రాజు పదవీ కాలం ముగుస్తుంది. అలాగే ఆయన ప్రజల్లోకి వెళ్లలేదనే భావన ఉంది. ఇక దీనిపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు జేపీ.నడ్డా ఫోన్ చేసి చెప్పారని.. అలాగే కొత్త బాధ్యతలు ఇస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారని తెలిపారు.