Bicycle Washing Mission: సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయిన తర్వాత కొత్త కొత్త వీడియోలు సందడి చేస్తున్నాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వీడియోను చూస్తుంటే సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చేసినట్టు కనిపిస్తోంది. అయినప్పటికీ లక్షల్లో వ్యూస్ నమోదు చేసింది.
ఆ వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.. ఓ మహిళ తన ఇంట్లో వాళ్ళ దుస్తులను టబ్బులో సర్ఫ్ వేసి నానబెట్టింది. అందులో సైకిల్ పెడల్ వచ్చే విధంగా ఏర్పాటు చేసింది. సైకిల్ ను పడుకోబెట్టి పెడల్ తిప్పడం మొదలుపెట్టింది. దీంతో టబ్బులో ఉన్న దుస్తులు వాషింగ్ మిషన్లో తిరిగినట్టు తిరగడం మొదలుపెట్టాయి. ఈ వీడియోను ఓ వ్యక్తి తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
వాస్తవానికి గతంలో దుస్తులను చేతులతో ఉతికేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. వాషింగ్ మిషన్ సహాయంతో దుస్తులను ఉతుకుతున్నారు. దుస్తులను మొత్తం అందులో వేస్తే ఆ మిషన్ ఉతుకుతుంది. కొత్తగా వస్తున్న మిషన్లయితే దుస్తులను అవి ఉతకడం మాత్రమే కాదు, ఆరబెడుతున్నాయి కూడా. ఎటువంటి వాషింగ్ మిషన్ అవసరం లేకుండా దుస్తులను ఉతికే విధానాన్ని ఆ మహిళ ఆ వీడియోలో చూపించడం పట్ల చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వాషింగ్ మిషన్ లోని ఫ్యాన్ అత్యంత వేగంగా తిరుగుతుంది. పైగా అందులో పీడనం ఎక్కువగా ఉంటుంది. అందువల్లే దుస్తులకున్న మురికి మొత్తం వదిలిపోతుంది. ఆ వీడియోలో ఆ మహిళ చూపించినట్టు సైకిల్ ఫెడల్ ను తిప్పుతుంటే దుస్తులకున్న మురికి మొత్తం పోతుందా? అనేది ఒకింత అనుమానం గానే ఉంది. ఏది ఏమైనప్పటికీ.. సైకిల్ ఫెడల్ ద్వారా వాషింగ్ మిషన్ లాగానే దుస్తులను ఉతికిన అనుభూతి కలిగించడం మాత్రం వేరే లెవెల్.
మా అమ్మ వాషింగ్ మేషిన్
కొందామని రోజు
ఎప్పటినుండో అడుగుతాంది
మా ఇంట్లో కూడా సైకిల్ ఉంది
వెంటనే మా అమ్మకి
ఈ గుడ్ న్యూస్ చెప్పాలి
pic.twitter.com/TWpP74tVlS— అభినవ్ కృష్ణ ୧⍤⃝ (@Nee_Nimsaare) May 2, 2024