Uttar Pradesh
Uttar Pradesh: యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి వారి ఆటలను కట్టిపారేయడం మొదలైంది. అసాంఘిక శక్తుల ఇంటిముందు బుల్డోజర్ వాలిపోవడం ప్రారంభమైంది. ఫలితంగా బుల్డోజర్ మార్క్ న్యాయం మొదలైంది. రాబిన్ హుడ్ తరహాలో యోగి ఆదిత్యనాథ్ వ్యవహరించడంతో ఉత్తరప్రదేశ్లో ఆయన పేరు ఒక బ్రాండ్ అయిపోయింది. బుల్డోజర్ అనేది వజ్రాయుధం అయిపోయింది. బుల్డోజర్ అనే పేరు వినిపిస్తే అక్రమార్కుల గుండెల్లో వణుకు మొదలైంది. బుల్డోజర్ ద్వారా ఎంతో మంది అసాంఘిక శక్తులను యోగి ప్రభుత్వం తొక్కి పడేసింది. భూమ్మీద బతకాలంటేనే భయం గలిగేలా చేసింది. అందువల్లే చాలామంది అక్రమార్కులు జైళ్ళకు వెళ్లిపోయారు. ఫలితంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ఎటువంటి అసాంఘిక సంఘటనలకు తావు లేకుండా సాగిపోతోంది.
ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారో..
బుల్డోజర్ అంటే ఉత్తర ప్రదేశ్ వాసులు వణికి చస్తున్న ఈ సమయంలో ఓ కుటుంబం చేసిన పని సంచలనంగా మారింది. ప్రస్తుత కాలంలో వివాహాలను.. ఇతర వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న తరుణంలో… ఉత్తరప్రదేశ్లోని ఒక కుటుంబం మాత్రం సరికొత్త ట్రెండ్ సృష్టించింది. తమ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఎక్కువగా బుల్డోజర్ల వినియోగిస్తారు నేపథ్య.. ఝాన్సీ ప్రాంతంలో ఓ పెళ్లి ఊరేగింపు అందరి దృష్టిని ఆకర్షించింది. వధువు కుటుంబం పెళ్లి ఊరేగింపులో కార్లకు బదులుగా బుల్డోజర్ (Bulldozer) కాన్వాయ్ ఏర్పాటు చేసింది. వధువు కరిష్మా కోసం వరుడు రాహుల్ యాదవ్ కారులో ఎదురుచూస్తుండగా.. కరిష్మా తండ్రి ఏకంగా బుల్డోజర్ కాన్వాయ్ ఏర్పాటు చేశాడు. కరిష్మా పెళ్లి ఊరేగింపు విభిన్నంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ తరహాలో ప్రయత్నించామని ఆమె తండ్రి రామ్ కుమార్ వెల్లడించారు. పైగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బుల్డోజర్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. అందువల్లే జనాలు కూడా ఆసక్తిగా చూస్తారనే ఉద్దేశంతోనే బుల్డోజర్ తో ఊరేగింపు నిర్వహించామని రామ్ కుమార్ వెల్లడించారు..” మా రాష్ట్రంలో బుల్డోజర్ మార్క్ న్యాయం జరుగుతూ ఉంటుంది. బుడోజర్ అనేది అక్రమార్కుల గుండెల్లో ఒక అస్త్రం లాగా మారిపోయింది. అందువల్లే దాని కాన్వా ఏర్పాటు చేసి మా కుమార్తె వివాహ ఊరేగింపు నిర్వహించాం. ఇది కూడా మా అల్లుడికి, కూతురికి విభిన్నంగా అనిపిస్తోంది. చూసే వాళ్ళు కూడా ఆశ్చర్యంగా వీక్షించారు. మీడియా ప్రధానంగా ఫోకస్ చేసింది. ఇక సోషల్ మీడియాలో అయితే లెక్కలేదు. దీనికోసమే మా ప్రయత్నం మొత్తం. మేము కోరుకున్న ఒక దానికంటే ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఇంతకంటే సంతోషం మరొకటి ఉండదు. పైగా మా కుమార్తె పెళ్లి ఊరేగింపు జీవితాంతం గుర్తుండిపోతుందని” రాంకుమార్ వ్యాఖ్యానించాడు.