Tirupati Tiktok Couple Marriage Twist: కన్యాదానం సినిమా గుర్తుంది కదూ. ఆ చిత్రంలో హీరో శ్రీకాంత్ తన భార్య రచనను ఆమె ప్రియుడు ఉపేంద్రకు ఇచ్చి వివాహం చేస్తాడు. రచన తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేసినా.. సమాజం ఒప్పుకోకపోయినా దగ్గరుండి పెళ్లి చేస్తాడు. తల్లిదండ్రుల స్థానంలో ఉండి ప్రేమికులను కలుపుతాడు. వైవిధ్యభరితంగా తీసిన ఈ చిత్రం తెలుగునాట విశేష ఆదరణ పొందింది. అయితే ఈ చిత్రాన్ని ప్రేరణగా తీసుకున్నారో.. లేక మరే ఇతర కారణాలో తెలియదు కానీ.. తిరుపతిలో విమల అనే మహిళ తన భర్త కల్యాణ్ ప్రేమించిన నిత్య శ్రీతో వివాహం జరిపించింది. దగ్గరుండి పెళ్లి చేయించింది. నిండు మనసుతో ఆశీర్వదించింది. అయితే అక్కడికి కొద్దిరోజులకే ట్విస్ట్ నడిచింది. మొదటి భార్య విమల, భర్త కళ్యాణ్ అదృశ్యమయ్యారు. దీంతో నవ వధువు నిత్యశ్రీ లబోదిబోమంటోంది.

హైదరాబాద్ కు చెందిన నిత్యశ్రీకి టిక్ టాక్ వీడియోలు చేసే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఆమె పుట్టిన రోజు నాడు ఓ వీడియో చేసింది. దానిని చూసిన కల్యాణ్ లైక్ కొట్టి కామెంట్ పెట్టాడు. అలా ప్రారంభమైన పరిచయం వారి మధ్య ప్రేమకు దారితీసింది. ప్రతీ రెండు, మూడు నెలలకు కలుసుకునేవారు. తొలుత నిత్యశ్రీయే పెళ్లి ప్రపోజుల్ తెచ్చింది. అయితే కల్యాణ్ మాత్రం తనకు వివాహమైందని నిత్యశ్రీకి స్పష్టతనివ్వలేదు.
Also Read: Mahesh Babu Mother Passes Away: మహేష్ బాబు తల్లి మృతి: చిరంజీవి సహా సినీ ప్రముఖుల సంతాపం
తీరా వివాహ సమయంలో మాత్రం విమల అన్నీతానై వ్యవహరించింది. పెళ్లి పెద్దగా ఉండి వివాహం చేసింది. అయితే పెళ్లికి ముందే ముగ్గురం కలిసి ఉందామని వారి మధ్య ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. అయితే పెళ్లి చేసుకున్న ఒకటి రెండు రోజులకే కల్యాణ్ విమలతో జంప్అయ్యాడు.దీంతో బాధితురాలు నిత్యశ్రీ తనకు జరిగిన అన్యాయంపై కన్నీరుమున్నీరవుతోంది. అయితే కమలకు ఇది వరకే రెండు పెళ్లిళ్లు అయ్యాయని.. అసలు కమలను తన భర్త పెళ్లి చేసుకోలేదని కూడా చెబుతోంది. అసలు కమల తన భర్తకు మొదటి భార్య కానేకాదని తెల్చేసింది. నిత్యశ్రీ మాటల్లో కూడా స్పష్టత లేదు.

అయితే బంధువులు వారి మధ్య పంచాయితీ పెట్టినట్టు తెలుస్తోంది. ఏవండి ఆవిడొచ్చింది సినిమాలో శోభన్ బాబును ఇద్దరు భార్యలు వంతులు వేసుకుంటారు. ఆ మాదిరిగా భర్తను చేరో రోజులు పంచుకోండి అంటూ పెద్ద మనుషులు సలహా ఇచ్చారు. అయితే దీనికి నిత్యశ్రీ సమ్మతించడం లేదు. నా భర్త నాకే సొంతమని ఆమె చెబుతుండడంతో పంచాయితీ తెగడం లేదు. అయితే నిత్యశ్రీకి ముగ్గురం కలిసి ఉందామని పెళ్లికి ముందు చెప్పారని.. కానీ వివాహం తరువాత నిత్యశ్రీ అడ్డం తిరగడంతో వారిద్దరు చెక్కేశారని స్థానికులు చెబుతున్నారు.
Also Read: Manchu Vishnu: మంచు విష్ణు పై ట్రోల్స్ వెనుక ఓ స్టార్ హీరో ?.. విష్ణు సంచలన కామెంట్స్ !