Software Employees Hardships: నేటి కాలంలో పెద్దపెద్ద కంపెనీలు ఉద్యోగాలలో కోత విధిస్తున్నాయి. ఉద్యోగులను అడ్డగోలుగా తొలగిస్తున్నాయి. ఇది ఎక్కడదాకా వెళ్తుందనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. పెద్ద పెద్ద కంపెనీల నుంచి మొదలుపెడితే చిన్న చిన్న కంపెనీల వరకు పరిస్థితి ఇలానే ఉంది. లక్షల మంది ఇప్పటికే ఉపాధిని కోల్పోయారు. ఉపాధిని కోల్పోవడానికి ఇంకా చాలామంది లైన్ లో ఉన్నారు. ఉన్నవారు కత్తి మీద సాములాగా ఉద్యోగాలను చేస్తున్నారు. ఎప్పుడు ఊడుతాయో తెలియక.. అసలు కొలువులు ఉంటాయో లేదో తెలియక దిన దిన గండం లాగా జీవితాన్ని సాగిస్తున్నారు.. ఈ క్రమంలో సాఫ్ట్ వేర్ కొలువులు ఎంత దారుణంగా ఉంటాయో.. వాటి వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారో చెబుతూ ఓ యువకుడు పాట రూపొందించాడు. పేరడీగా ఈ పాట ఉన్నప్పటికీ సాఫ్ట్ వేర్ కొలువు కత్తి మీద సాములాగా ఎలా ఉందో ఆ వ్యక్తి తన భావాలను వ్యక్తీకరించాడు.
Also Read: జగన్ ఐదు వారాల వ్రతాలు చేస్తున్నాడా? ఏబీఎన్ వెంకటకృష్ణ సూపర్ సిక్స్ అమలు పై ఇలానే మాట్లాడగలడా?
ఆ పాటకు పేరడీగా ఉన్నప్పటికీ..
“హలో రమ్మంటే వచ్చిందా ఈ ప్రేమ” కు పేరడీగా ఈ పాట ఉంది. ఐటి కొలువులో ప్రారంభంలో ఉన్నంత మెరుపులు లేవని.. సెలవులు అసలు దొరకడం లేదని.. ఐటీ ఉద్యోగం వల్ల లైఫ్ లో లైఫ్ మిస్ అయిందని.. ఫస్ట్ తారీఖునే జీతం పడుతున్నా జేబుకే బొక్కపడుతోందని.. ఐటీ ఉద్యోగం వల్ల చివరికి నెత్తి మీద ఉన్న జుట్టు కూడా ఊడిపోతుందని.. ఆ వ్యక్తి పాట రూపంలో వివరించాడు. ఈ పాట వినడానికి నవ్వు తెప్పిస్తున్నప్పటికీ.. పేరడీగా ఉన్నప్పటికీ.. వాస్తవ పరిస్థితిని వెల్లడిస్తోందని ఐటి ఉద్యోగులు చెబుతున్నారు. ” ఉద్యోగం భరోసా ఇవ్వడంలేదు. కంపెనీలు ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వడం లేదు. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో తెలియడం లేదు. ఊడుతుందో కూడా అర్థం కావడం లేదు. ఇలాంటి అప్పుడు అసలు ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చామా అర్థం కావడం లేదు. ఇలాగే ఉంటే పరిస్థితి ఎలా మారిపోతుందో కూడా అంత చిక్కడం లేదని” ఐటీ ఉద్యోగులు బాధపడుతున్నారు. ఇక మార్కెట్లను చూసుకుంటే ఐటీ ఉద్యోగులకు ఏమాత్రం అనుకూలంగా లేదు. ప్రపంచం మొత్తం కృత్రిమ మేధ వైపు పరుగులు తీస్తోంది. కృత్రిమ మేద వల్ల అన్ని రంగాలు ప్రభావితమవుతున్నాయి. దీనికి ఐటీ రంగం మినహాయింపు కాదు. పైగా కృత్రిమ మేద వల్ల మనుషులతో అవసరం లేకుండా పోతున్న నేపథ్యంలో.. చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఐటీ కంపెనీలు బయటికి పంపిస్తున్న నేపథ్యంలో చాలామంది రోడ్లమీద ఖాళీగా తిరుగుతున్నారు.