Red Cobra : భూమిపై లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి. నిత్యం కోట్లాది జీవులు చనిపోతుండగా అంతే సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. ఒకే జాతికి చెందిన రకరకాల జీవులు కూడా మనకు తారసపడతాయి. ఇక పాముల విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా 3 వేలకుపైగా సర్ప జాతులు ఉన్నాయి. అయితే ఆ జాతులన్నీ విషపూరితం కాదు. వాటిలో కొన్ని మాత్రమే విషపూరితమైనవి. అలాగే మన దేశంలో 69 రకాల జాతుల పాములు అత్యంత ప్రమాదకరమైనవిగా పరిశోధకులు గుర్తించారు.
అరుదైన పాము..
ఇక మనలో 90 శాతం మంది పాములంటే భయపడతారు. చిన్న పిల్ల కనిపించినా ఆమడ దూరం పరిగెత్తుతారు. అయితే దేశంలో ఉన్న 69 రకాల జాతుల్లో తాజాగా మరో అరుదైన జాతిని పాము దొరికింది. ఇప్పుడు ఆ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కనిపించే పాము ఎరుపు రంగులో ఉంది. చిన్నగా పడగ విప్పి అందంగా కనిపిస్తోంది. అయితే ఇది చూసేందుకు ముద్దుగా ఉన్నా అత్యంత విషపూరితమైన నాగు పాముగా చెబుతున్నారు.
అరుదైన జాతి..
ఇక వీడియోలో కనిపించిన ఎరుపు రంగు పామును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో పామును ఓ యువకుడు పట్టుకున్నాడు. దానిని లాగగానే అది పగడ విప్పడం కనిపిస్తుంది. ఈ రెడ్ స్పిటింగ్ కోబ్రా అరుదైన జాతికి చెందిన పాము అని యానిమాల్ డైవర్సిటీ నివేదికలో తెలిపారు.
ఆఫ్రికాలో మాత్రమే..
ఈ ఎరుపు రంగు నాగుపాము ఆఫ్రికా ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుందని చెబుతున్నారు. దీనిని శాస్త్రీయ నామంలో నజా పల్లీడ అని పిలుస్తారు. ఉగాండా, సూడాన్, ఈజిప్ట్, టాంజానియా ప్రాంతాల్లో ఈ రెండ్ స్పిటింగ్ పాములు ఎక్కువగా కనిపిస్తాయట. అన్ని నాగుపాముల్లో అత్యంత విషపూరితమైనది ఇదేనట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను snake_fraind అనే ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు.
View this post on Instagram