Kerala Bride Wedding Photoshoot: అన్నిసార్లు కాకపోయినా.. కొన్నిసార్లు ప్రజలు చేసే పనులు ప్రభుత్వానికి చురకలంటిస్తాయి. ఆకాశంలో విహరిస్తున్న పాలకులను దెబ్బకు నేల మీదకి దిగేలా చేస్తాయి. అలాంటిదే ఈ సంఘటన. మామూలుగా పెళ్లికి సంబంధించిన ఫోటోషూట్ అంటే అందమైన ప్రదేశాలు, జలపాతాలు, కొండలు, కోనలు.. ఇలా రకరకాలుగా ఆలోచిస్తారు. విద్యావంతులకు పెట్టింది పేరైన కేరళ రాష్ట్రంలో ఓ నవ వధువు మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించింది. త్వరలో తన పెళ్లి కాబోతున్నందున ఫోటోషూట్ కి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. తనకు కాబోయే భర్త రకరకాల అందమైన ప్రదేశాలను చూపిస్తే వద్దు పో అన్నది. దీనికి అతను నొచ్చుకున్నా.. ఆమె నిర్ణయాన్ని విని మెచ్చుకున్నాడు.

ఇంతకీ ఆ నవ వధువు ఏం చేసిందంటే
కేరళకు చెందిన ఓ యువతి ఓ యువకుడిని ప్రేమించింది. మొదట్లో ఇరు కుటుంబాల వారు వారించినా.. తర్వాత ఆ ఇద్దరి నిర్ణయానికి తలొగ్గారు. మంచి రోజు చూసి ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆరోజు రానే వచ్చింది. ప్రస్తుత తరం పెళ్లికి ముందే ఫోటోషూట్లని, ప్రీ వెడ్డింగ్ సాంగ్ లని నానా హడావిడి చేస్తోంది. ఈ జంట కూడా అలానే చేయాలని నిర్ణయించుకుంది. అయితే మొదట్లో వధువు కాబోయే వరుడు అందమైన ప్రదేశాలు చూపించాడు. ఇక్కడే మనం వెడ్డింగ్ ఫోటో షూట్ పెట్టుకుందామని ఆమెకు చెప్పాడు. కానీ దీనిని ఆమె తిరస్కరించింది. ఇందుకు అతడు నొచ్చుకోగా.. తర్వాత ఆమె తన అంతరంగాన్ని ఆవిష్కరించడంతో మెచ్చుకున్నాడు. ఫోటోషూట్కు సిద్ధమైన పెళ్ళికూతురు తమ ప్రాంతంలో గుంతలు పడ్డ రోడ్డుపై నడుస్తూ ఫోటోలకు ఫోజు ఇచ్చింది. పెళ్లి కుమార్తెగా ముస్తాబై నగలు ధరించి గుంతల్లో నీరు నిలిచిన రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లి ఫోటోలు దిగింది. అయితే ఇటీవల కేరళలో భారీ వర్షాలు కురిసాయి. కేరళలో వర్షాలు కురవడం సాధారణమే అయినప్పటికీ.

ఈసారి మాత్రం రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. ఎంతలా అంటే కనీసం నడిచేందుకు కూడా వీలు లేకుండా. తమ ప్రాంతంలో కూడా రోడ్లు ఇలాగే పాడవడంతో సదరు నవ వధువు అధికారులకు ఎన్నో మార్లు మొరపెట్టుకుంది. ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించింది. అయినప్పటికీ చలనం లేకపోవడంతో.. తన ఫోటోషూట్ ద్వారా అయినా ప్రభుత్వంలో చలనం వస్తుందని ఆమె ఈ పని చేసింది. ఈ ఫోటో షూట్ కు సంబంధించిన పలు ఫోటోలను నవవధువు కోరిక మేరకు ఏరో వెడ్డింగ్ కంపెనీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదే సమయంలో కేరళ సీఎం పినరయ్ విజయన్ కు మొట్టికాయలు వేశాయి. ఈ ఫోటోలను చూపిస్తూ అక్కడి ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార పార్టీ నాయకులను ఒక ఆట ఆడుకుంటున్నారు. హత్యా రాజకీయాలు మాత్రమే తెలిసిన పినరయ్ విజయన్ కు రోడ్లను బాగు చేయడం ఎలా తెలుసని ప్రశ్నిస్తున్నారు. అదే క్యాపికో యాజమాన్యంకైతే సాగిలా పడతారని ఎద్దేవా చేస్తున్నారు. వెంబనాడ్ సరస్సు పక్కన క్యాపికో యాజమాన్యం అక్రమంగా విల్లాలు నిర్మించడం, వాటి కూల్చివేతను అడ్డుకోవడం, పైగా ఆ యాజమాన్యానికి వత్తాసు పలకడం వంటి వాటితో ముఖ్యమంత్రి విజయన్ ఇబ్బందుల్లో పడ్డారు. అదీ చాలదన్నట్టు ఇప్పుడు ఈ నవ వధువు ఫోటో షూట్ తో మరింత తలపోటును ఎదుర్కొంటున్నారు. విద్యాదిధుకుల రాష్ట్రమైన కేరళలో ఇది మున్ముందు ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో..
[…] Also Read: Kerala Bride Wedding Photoshoot: ఈ నవ వధువు పెళ్లి ఫోటోషూట… […]