Prabhas Viral Photo: ప్రభాస్ పేరు వింటే చాలు అందరికి ఆనందమే. అందరికి ఇష్టమైన వాడిగా ప్యాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ ఎదగడం తెలిసిందే. బాహుబలితో తన ప్రతిభను చూపిన అతడంటే అమ్మాయిలకు క్రేజీ. ఆ నువ్వో ప్రభాస్ వు అంటూ అందరిని దెప్పి పొడవడం చూస్తుంటాం. అంతటి పేరు ప్రఖ్యాతులు సాధించుకున్న హీరోగా ప్రభాస్ ను అందరు ఆదరిస్తారు అభిమానిస్తారు. కుర్ర కారు నుంచి వృద్ధుల వరకు ప్రభాస్ కు అభిమానులు ఉండటం విశేషం. అతనంటే ఓ పిచ్చి. ఇక సినిమాల విషయంలో తనదైన శైలిలో రాణిస్తూ సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ ఎదిగిన హీరోగా సుపరిచితమే. ఈశ్వర్ నుంచి రాధేశ్యాం వరకు అతడు తన నటనలో ఏదో కొత్తదనం చూపించాలనే తాపత్రయపడటం మామూలు విషయం కాదు. పెళ్లికాని అమ్మాయిల గుండెల్లో ప్రభాస్ ఓ ముల్లులా గుచ్చుకుంటాడని కూడా తెలుసు.

2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే సినిమాతో ప్రభుదేవా దర్శకుడిగా మారారు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో 2006లో పౌర్ణమి సినిమాను రూపొందించారు నిర్మాత ఎంఎస్ రాజు. ఈ సినిమాకు కూడా ప్రభుదేవానే దర్శకుడు. దీంతో అప్పుడే ఎంఎస్ రాజు పుట్టిన రోజు రావడంతో హీరోలు ప్రభాస్, సిద్ధార్థ్, హీరోయిన్ చార్మి ఆ వేడుకకు హాజరయ్యారు. అప్పుడు ఓ ఫొటో తీయించుకున్నారు. ఆ ఫొటోను ఎంఎస్ రాజు ఇప్పుడు పోస్టు చేయడంతో అందులో ప్రభాస్, సిద్ధార్థ్, ప్రభుదేవా ఒకే పోజులో నిల్చోవడం చూస్తున్నాం. అప్పటి ఫొటోను ఎంఎస్ రాజు అభిమానులతో పంచుకోవడంతో అందరు ఫిదా అవుతున్నారు.
Also Read: Tollywood Producers to Stop Shootings: టాలీవుడ్ నిర్మాతలు సంచలన నిర్ణయాలు.. 2 నెలలు షూటింగ్స్ బంద్
పౌర్ణమి సినిమాకు కూడా దర్శకుడు ప్రభుదేవానే కావడం గమనార్హం. అప్పట్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా సంచలన విజయం నమోదు చేసింది. పౌర్ణమి మాత్రం నిరాశ పరచింది. ఇందులో త్రిష నటనకు అందరు మంత్రముగ్దులయ్యారు. త్రిష, ప్రభాస్ ప్రేమ హైలెట్ గా నిలుస్తుంది. సినిమా నిరాశ పరచినా ప్రేక్షకుల గుండెల్లో మాత్రం నిలబడటం విశేషం. దర్శకుడిగా ప్రభుదేవా మంచి మార్కులే కొట్టేశాడు. అలా దర్శకుడిగా ఎదిగిన ప్రభుదేవా ప్రస్తుతం హిందీ సినిమాలు కూడా చేస్తూ తనలోని టాలెంట్ చూపిస్తున్నాడు.

ఎంఎస్ రాజు పుట్టిన రోజు సందర్భంగా తీయించుకున్న ఫొటోను ఇన్నేళ్లకు బయటపెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎప్పుడో తీయించుకున్న ఫొటోను అభిమానులతో పంచుకోవడం ఆనందంగా అనిపించిందని హీరోలు కూడా చెబుతున్నారు. అప్పటి ఫొటోలో ప్రభాస్ ను చూస్తుంటే ముచ్చటగా ఉన్నాడని గుర్తుచేసుకుంటున్నారు. అందులో ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ కూడా ఉన్నట్లు చూస్తున్నాం. అలనాటి పాత గుర్తులను నెమరు వేసుకుంటూ తీయించుకున్న ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రభాస్ అభిమానులకు పండగ చేస్తోంది.
Also Read:Ileana: స్టార్ హీరోయిన్ బ్రదర్‌తో ఇలియానా సరసాలు.. ఫొటోలు వైరల్
Recommended Videos



[…] Also Read: Prabhas Viral Photo: వైరల్ గా మారుతున్న 17 ఏళ్ల క్రి… […]
[…] Also Read:Prabhas Viral Photo: వైరల్ గా మారుతున్న 17 ఏళ్ల క్రి… […]