https://oktelugu.com/

Britain Mother: తల్లి ఆఫర్‌: రెచ్చిపోయిన డాటర్‌.. ఏడాదిలో వంద మందితో డేటింగ్‌..

ఎంత అప్‌గ్రేటెడ్‌ సొసైటీలో బతుకుతున్నా ప్రేమ విషయంలో తల్లిదండ్రుల వైఖరి కాస్త కఠినంగా ఉంటోంది. ఇప్పటికీ ప్రేమ పెళ్లిళ్లకు తల్లిదండ్రులు బోలెడన్నీ ఆంక్షలు పెడుతుంటారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 4, 2023 / 11:54 AM IST

    Britain Mother

    Follow us on

    Britain Mother: పిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నామంటేనే పేరెంట్స్‌ తాట తీసేస్తారు. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు ప్రేమ విషయంలో చాలానే ఆంక్షలు పెడుతుంటారు. అబ్బాయిలకు దూరంగా ఉండమని, వీలైతే మాట్లాడటం కూడా చేయొద్దని కాలేజీ రోజుల నుంచే హితబోధ చేస్తుంటారు. కానీ బ్రిటన్‌కు చెందిన ఓ తల్లి మాత్రం దగ్గరుండి మరీ కూతురిని డేటింగ్‌కు పంపించింది. కూతురి ఖర్చుల కోసం 500 డాలర్లు కూడా ఇచ్చి హ్యాపీగా డేటింగ్‌ చేయమని ప్రోత్సహించింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

    వంద మందితో..
    ఎంత అప్‌గ్రేటెడ్‌ సొసైటీలో బతుకుతున్నా ప్రేమ విషయంలో తల్లిదండ్రుల వైఖరి కాస్త కఠినంగా ఉంటోంది. ఇప్పటికీ ప్రేమ పెళ్లిళ్లకు తల్లిదండ్రులు బోలెడన్నీ ఆంక్షలు పెడుతుంటారు. కానీ బ్రిటన్‌కు చెందిన ఓ తల్లి మాత్రం కూతుర్ని డేటింగ్‌ చేయమని దగ్గరుండి మరీ పంపించింది. ఒకరిద్దరిని కాదు, ఏకంగా వంద మందితో డేటింగ్‌ చేయమని, అలా చేస్తే డబ్బులు కూడా ఇస్తానంటూ షాకింగ్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇంకేముంది కూతురు కూడా రెచ్చిపోయింది.

    అందాలతో గాలం వేస్తూ..
    తన అందంతో అబ్బాయిలకు గాలం వేసి ఒకరిద్దరితో కాదు, ఏకంగా 100 మంది బాయ్‌ఫ్రెండ్స్‌ను మార్చేసింది. అది కూడా ఒక్క ఏడాదిలోనే కావడం విశేషం. ఈ విషయాన్ని యువతి సోదరి ఎలిస్ కేరొలీన్ టిక్‌టాక్‌లో షేర్‌ చేయడంతో ఈ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తల్లి ఇచ్చిన టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసినందుకు ఆ యువతికి ఆమె తల్లి గ్రాండ్‌గా వేడుకలు జరిపిందట. కేక్‌పై 100 నంబర్‌ క్యాండిల్‌తో ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నారట.