Homeట్రెండింగ్ న్యూస్Director James Cameron: టైటానిక్ ప్రమాదం జరిగిన చోట అద్భుత శక్తి దాగి ఉంది.. టైటానిక్...

Director James Cameron: టైటానిక్ ప్రమాదం జరిగిన చోట అద్భుత శక్తి దాగి ఉంది.. టైటానిక్ దర్శకుడు కామెరూన్

Director James Cameron: అట్లాంటిక్ మహాసముద్రంలో వందేళ్ళ క్రితం కూలిపోయిన టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లిన మరో ఐదుగురు సాహస పర్యాటకులు కూడా తాజాగా ప్రమాదానికి గురై మృత్యువాత చెందారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనలో మృతి చెందిన ఐదుగురు అత్యంత ధనవంతులే కాకుండా.. ఇప్పటి వరకు అనేక సాహస యాత్రలో పాలుపంచుకున్న వ్యక్తులు కూడా కావడం గమనార్హం. ఈ ఘటనతో టైటానిక్ నౌక మునిగిపోయిన ప్రాంతం పట్ల అనేక రకమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈనాపద్యంలో టైటానిక్ చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్ చేసిన వ్యాఖ్యలు అందరికీ ఆసక్తిని కలిగిస్తున్నాయి.

టైటానిక్.. భారీ నౌక. వేలాదిమంది ప్రయాణికులతో అట్లాంటిక్ మహాసముద్రం గుండా ప్రయాణం సాగిస్తున్న తరుణంలో ప్రమాదవశాత్తు కూలిపోయింది. 1912లో జరిగిన ఈ ఘటనలో వేలాది మంది ప్రాణాలను కోల్పోయారు. వందేళ్లు దాటుతున్న ఈ టైటానిక్ నౌక గురించి ప్రజల్లో ఆసక్తి మాత్రం తగ్గలేదు. ఈ ప్రమాదం జరిగిన అట్లాంటిక్ మహాసముద్రం లోపలికి వెళ్లి నౌక శకలాలను చూసి వస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా అడ్వెంచర్ ట్రిప్ నిర్వహిస్తున్న సంస్థలు ఉన్నాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో 12 వేల అడుగుల లోతులో ఈ శకలాలు ఉన్నాయి. తాజాగా వివిధ దేశాలకు చెందిన ఐదుగురు బృందం ఈ శకలాలను చూసేందుకు టైటాన్ పేరుతో రూపొందించిన జలాంతర్గామిలో వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాత చెందారు. అయితే, ఈ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ప్రమాదం గురించి స్పందిస్తూ అనేక రంగాలకు చెందిన ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టైటానిక్ చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్ కూడా దీనిపై స్పందించారు.

అక్కడ ఏదో తెలియని శక్తి దాగి ఉంది..

టైటానిక్ నౌక మునిగిపోయిన ప్రాంతంలో తెలియని శక్తి దాగి ఉందని టైటానిక్ చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్ స్పష్టం చేశాడు. దీనిపై మరింత స్పందించిన ఆయన మాట్లాడుతూ.. తాను ఇప్పటి వరకు 33 సార్లు టైటానిక్ మునిగిన ప్రాంతానికి వెళ్లి వచ్చానని, ఇది అత్యంత సాహసంతో కూడుకున్న ప్రయాణం అని పేర్కొన్నారు. టైటానిక్ శకలాలు చూడటానికి టైటాన్ లో వెళ్లి ఐదుగురు మృతి చెందడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే టైటానిక్ మునిగిన చోట ఏదో అద్భుత శక్తి ఉందని, గతంలోనూ తనకు భయంకర అనుభవాలు ఎదురయ్యాయని ఈ సందర్భంగా కామెరూన్ వెల్లడించాడు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆందోళనకు గురి చేస్తున్నాయి. అంతటి ప్రమాదానికి గురి చేసే ప్రాంతానికి ఎందుకు వెళ్తున్నారు అర్థం కావడం లేదు అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ప్రమాదంలో మృతి చెందిన వాళ్ళు వీరే..

టైటానిక్ సకలాలను చూసేందుకు టైటాన్ జలాంతర్గామిలో వెళ్లిన ఐదుగురు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో పాకిస్థాన్ కు చెందిన బిలియనీర్ షాజాద్ దావూద్ (48), ఆయన కుమారుడు సులేమాన్ (19), యూఏఈ లో ఉంటున్న బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఈ యాత్ర నిర్వాహకుడు, ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్, ఫ్రెంచ్ మాజీ నావిక దళ అధికారి పాల్ హెన్రీ ఉన్నారు. ప్రత్యేక జలాంతర్గామిలో టైటానిక్ శకలాలు చూసేందుకు వీరు వెళ్లారు.

RELATED ARTICLES

Most Popular