Homeట్రెండింగ్ న్యూస్Plant Fungus: దేశంలోకి మరో అరుదైన రోగం.. మనిషికి సోకిన వృక్ష శిలీంద్రం.. కలకలం

Plant Fungus: దేశంలోకి మరో అరుదైన రోగం.. మనిషికి సోకిన వృక్ష శిలీంద్రం.. కలకలం

Plant Fungus
Plant Fungus

Plant Fungus: సాధారణంగా మనిషి నుంచి మనిషికి వైరస్ వ్యాప్తి చెందడం చూస్తుంటాం. కొన్నిసార్లు పక్షుల నుంచి జంతువుల నుంచి కూడా వైరస్లు మనుషులకు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఓ వృక్ష శిలీంద్రం మనిషికి సోకింది. ప్రపంచంలోనే ఈ తరహా కేసు తొలిసారి నమోదయినట్లు సదరు బాధితుడికి వైద్య సేవలు అందించిన వైద్య నిపుణుల బృందం పేర్కొనడం గమనార్హం. ఈ కేసు భారత్ లోనే నమోదు కావడం విశేషం.

ప్రపంచంలోనే తొలిసారి ఓ వృక్ష సంబంధిత శిలీంద్రం.. మనిషికి సోకి అనారోగ్యానికి కారణమైంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఓ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.

సాధారణంగా వృక్షజాతుల్లో వ్యాధికి కారణమయ్యే ఓ శిలీంద్రం తొలిసారి ఓ వ్యక్తికి సోకింది. ప్రపంచంలోనే ఈ తరహా తొలి కేసు ఇదే కావడం గమనార్హం. వృక్షాల్లో సిల్వర్ లీఫ్ వ్యాధికి కారణమయ్యే ‘కొండ్రోస్టీరియం పోర్పోరియం’ అనే శిలీంద్రం.. కోల్కతాకు చెందిన వృక్ష సంబంధిత శిలీంద్రాలపై పనిచేసే ఓ పరిశోధకుడికి సోకింది. బాధితుడికి చికిత్స అందించిన వైద్యులు ఈ కేసుకు సంబంధించిన రూపొందించిన ఓ నివేదిక.. ‘మెడికల్ మైకాలజీ కేసు రిపోర్ట్స్’ జర్నల్ లో ప్రచురితమయింది.

వ్యాధి సోకిన బాధితుడిలో ఇవి లక్షణాలు..

ఈ శిలీంద్రం బారిన పడిన బాధితుడిలో పలు లక్షణాలు కనిపించాయి. గొంతు బొంగురు పోవడం, దగ్గు, ఆయాసం, ఆహారం మింగడానికి ఇబ్బంది, ఆకలి మందగించడం వంటి లక్షణాలు బాధితుడి(61)లో కనిపించాయి. సదరు బాధితుడికి మధుమేహం ఇతర దీర్ఘకాలిక వ్యాధులు గాయాలు వంటివి ఏమీ లేవు. వృత్తిపరంగా ఆయన వృక్ష సంబంధిత మైకాలజిస్ట్. కుళ్ళిపోతున్న పదార్థాలు, పుట్టగొడుగులు, వివిధ వృక్ష సంబంధిత శిలీంద్రాలపై ఏళ్లుగా పరిశోధన సాగిస్తున్నారు. కుళ్లిపోతున్న పదార్థాలతో పనిచేయడమే ఈ అరుదైన సంక్రమణకు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ స్వభావం, వ్యాప్తి చెందగల సామర్థ్యం మొదలైనవి నిర్ధారితం కాలేదని ఆ నివేదికలో సదరు వైద్యుల బృందం వెల్లడించింది.

శస్త్ర చికిత్స నిర్వహించి కణితి తొలగింపు..

ఈ శిలీంద్రం బారిన పడిన వ్యక్తి ఆసుపత్రికి వచ్చిన తర్వాత పరీక్షించిన వైద్యులు.. ‘ బాధితుడి మెడ వద్ద కణితిని గుర్తించి శాస్త్ర చికిత్స ద్వారా తొలగించాం. అనంతరం తీసిన ఎక్సరేలో అసాధారణంగా ఏమీ కనిపించలేదు. ఆయన యాంటీ ఫంగల్ ఔషధాలు తీసుకున్నారు. ఇది జరిగి రెండేళ్లు అవుతుంది. ఇప్పుడు ఆయన క్షేమంగా ఉన్నారు. ఆ వ్యాధి పునరావృతం అవుతుందనేందుకు కూడా ఆధారాలు లేవు. అయితే సాంప్రదాయ పరీక్ష విధానాలు (మైక్రోస్కోపీ,కల్చర్) బాధితుడులో ఫంగస్ ఆనవాళ్లను గుర్తించలేకపోయాయి. ప్రస్తుతానికి సీక్వెన్సీ ద్వారా మాత్రమే ఈ అసాధారణ వ్యాధికారకాన్ని గుర్తించొచ్చు. వృక్ష సంబంధిత శిలీంద్రాల ద్వారా మనసులకు వ్యాధి సోకే అవకాశాలు వాటిని గుర్తించే విధానాల ఆవశ్యకతను ఈ కేసు చాటు చెబుతోంది’ అని వైద్యుడు తమ నివేదికలో తెలిపారు.

Plant Fungus
Plant Fungus

ఈ తరహా కేసు తొలిసారి..

ఈ తరహా కేసు నమోదు కావడం తొలిసారిగా సదరు వైద్య నిపుణుల బృందం చెబుతోంది. ఇటువంటి కేసులు తామెప్పుడూ చూడలేదని, వైద్య చరిత్రలో ఇటువంటి కేసులు నమోదైన దాఖలాలు, ఎవిడెన్స్ కూడా లేవని సదరు వైద్యులు పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ వృక్ష శిలీంద్రాల నుంచి వ్యాధి సోకే అవకాశం ఉందనే విషయాన్ని ఈ కేసు తెలియజేస్తుందని వైద్యులు పేర్కొనడం గమనార్హం.

Exit mobile version