Homeట్రెండింగ్ న్యూస్Malaysian Woman Love Marriage: నచ్చినవాడి కోసం.. రూ.2 వేల కోట్ల ఆస్తిని కాదనుకుంది!

Malaysian Woman Love Marriage: నచ్చినవాడి కోసం.. రూ.2 వేల కోట్ల ఆస్తిని కాదనుకుంది!

Malaysian Woman Love Marriage: ఆకర్షణనే ప్రేమ అనుకుంటున్న రోజులు ఇవీ. మోజు తీరాక వదిలించుకుంటున్న రోజులివీ. డబ్బు ఉంటే ఏదైనా చేయవచ్చనే రోజులవీ.. ఆస్తి కోసం కొన్ని రోజులు ప్రేమించి.. పెళ్లి చేసుకుని తర్వాత అంత చేస్తున్న కాలమిదీ.. ఇలాంటి నేటి సమాజంలో ఓ సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ యువతి.. సాదాసీదా వ్యక్తిని ప్రేమించింది. తల్లిదండ్రులు వారించినా చివరకు అతడినే పెళ్లాడిన ఆమె.. వారసత్వంగా వచ్చిన రూ.వేల కోట్ల ఆస్తిని కూడా కాదనుకుంది.

మైలేషియా బిజిసెన్‌ టైకూన్‌ కూతురు..
మలేసియాకు చెందిన ఏంజెలినా ఫ్రాన్సిస్‌ ఆదేశంలో ప్రముఖ వ్యాపారవేత్త ఖూకే పెంగ్, మాజీ మిస్‌ మలేసియా పాలైన్ ఛాయ్‌ దంపతుల కుమార్తె. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో జెడియా అనే స్నేహితుడితో ప్రేమలో పడింది. వివాహం చేసుకునేందుకు సిద్ధమైన ఆమె.. ఇదే విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపింది. కానీ, వారు మాత్రం అందుకు నిరాకరించారు. ఆర్థికపరంగా ఇరు కుటుంబాల్లో భారీ తేడా ఉందన్న వారు.. అతడిని దూరం కావడమో లేదా వారసత్వాన్ని వదులుకోవడమో చేయాలని ఆదేశించారు. చివరకు ప్రియుడితోనే స్థిరపడాలని నిశ్చయించుకున్న ఆమె.. ఇంటినుంచి బయటకు వెళ్లిపోయింది. 2008లో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో వారసత్వంగా వచ్చే సుమారు రూ.2 వేల కోట్ల ఆస్తినీ వదులుకుంది.

కుటుంబాలకు దూరంగా..
వివాహం అనంతరం ఇద్దరు కూడా వారి రెండు కుటుంబాలకు దూరంగానే ఉన్నారు. అయితే, చాలారోజులు దూరంగా ఉన్న ఫ్రాన్సిస్‌.. ఓసారి వారి తల్లి దండ్రులను కలవాల్సి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడమే అందుకు కారణం. న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చేందుకు ఫ్రాన్సిస్‌ కోర్టుకు వెళ్లింది. ఈ క్రమంలో తన తల్లి గురించి గొప్పగా వివరించిన ఆమె.. కుటుంబం కోసం ఆమె చేసిన సేవలను కొనియాడింది. తండ్రిపై మాత్రం విమర్శలు గుప్పించింది. ఏదేమైనా తల్లిదండ్రులిద్దరూ తిరిగి కలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని చెప్పిన ఆమె ప్రేమ కథ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సాదాసీదా జీవితం..
వేల కోట్ల ఆస్తులు వదుసుకుని సామాన్యుడిని పెళ్లాడిన ఫ్రాన్సిస్‌.. ఇప్పుడు సాదా సీదా జీవనం సాగిస్తోంది. నచ్చిన వాడితో ఉన్నంతలో ఏలోటూ రాకుండా జీవన ప్రయాణం సాగుతోందని తెలిపింది. ఇలాంటి ప్రేమ పెళ్లి విషయాల్లో కొన్నాళ్లకు కుటుంబంతో కలుస్తారు. కానీ, ప్రాన్సిస్‌ కుటుంబం మాత్రం కలవడానికి ఇష్టపడలేదు. ప్రాన్సిస్‌ కూడా వదులుకున్న తల్లిదండ్రుల గురించిగానీ, ఆస్తుల గురించి గానీ ఆలోచించలేదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular