Delhi Metro: నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నదట గురివింద. ఎవరు ఏమన్నా తాను అనుకున్నది చేసే మొండివారు ఉన్నారు. మనదేశంలో కొన్ని ప్రేమ విషయంలో హద్దులు ఉంటాయి. పశువులైతే ఎక్కడైనా చేసుకుంటాయి రొమాన్స్. మనం మనుషులం. మనకు కట్టుబాట్లు ఉన్నాయి. కానీ ఆ కట్టుబాట్లకు కుట్లేస్తున్నారు కొందరు. ఎవరున్నా మాకేంటి అని రెచ్చిపోతున్నారు.
ఆ మధ్య ద్విచక్ర వాహనాల మీద ఎదురెదురుగా కూర్చుని ముద్దులు పెట్టుకుంటూ పబ్లిక్ ప్రాంతాల్లో తిరిగిన సంఘటనలు మరచిపోకముందే మరో దారుణం చోటుచేసుకుంది. అందరు చూస్తుండగానే మెట్రోలో ఓ జంట ముద్దుల వర్షంలో తడిసిపోయింది. ఎక్కడ కుదరనట్లు సాక్షాత్తు మెట్రలోనే ముద్దుల్లో మునిగిపోయింది. దీంతో అందరు ఆశ్చర్యపోయారు.
అందరు చూస్తుండగానే ఒకరి మీద ఒకరు పడి పశువుల్లా ప్రవర్తించారు. ఇది మెట్రోనా లేక వ్యభిచారుల అడ్డానా అని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రొమాన్స్ చేసుకోవడానికి ట్రెయినే దొరికిందా? ఇంత బరితెగింపు ఉంటే ప్రజలు ఎలా వ్యవహరించాలి. కొంచెమైనా సిగ్గుందా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకాంత ప్రాంతాలు హోటళ్లు, పార్కులు ఉండగా మెట్రోలోనే దొరికిందా అని ట్వీట్లు పెట్టారు.
మనుషుల్లో మానవతా విలువలు నశిస్తున్నాయి. నైతిక విలువలు కనుమరుగవుతున్నాయి. సభ్య సమాజంలో ఉన్నామా? అడవిలో ఉన్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇలా బరితెగించిన వారిని ఏం చేయాలి. శిక్ష కూడా కఠినంగానే ఉండాలి. కానీ మన చట్టాల్లోని లూపులను ఆసరాగా చేసుకుని ఇలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.