Sadist Husband: 13 ఏళ్లు ఇంట్లో నరకం చూసిన మహిళ కన్నీటి కథ..!

Sadist Husband: రాముడు తండ్రి మాట జవదాటకుండా 14 ఏళ్లు వనవాసం చేశాడు. పాండవులు.. జూదంలో ఓడిపోయి 12 అరణ్యవాసం, ఏడాది అజ్ఞాత వాసం చేశారు. కానీ అనంంతపురానికి చెందిన ఓ మహిళ.. వివాహం చేసుకున్నందుకు 13 ఏళ్లు బయటి ప్రపంచాయికి దూర మైంది. ఎన్నో ఆశలతో అత్తారింటికి వెళ్తున్నానని భావించిన ఆమె నరక కూపంలోకే వెళ్లింది. ఎట్టకేలకు కోర్టు, పోలీసులు, మహిళా సంఘాల జోక్యంతో ఎట్టకేలకు విముక్తి పొందింది. అనంతపురం జిల్లా పుట్టపర్తికి చెందిన సుప్రియ […]

Written By: Raghava Rao Gara, Updated On : March 2, 2023 11:24 am
Follow us on

Sadist Husband

Sadist Husband: రాముడు తండ్రి మాట జవదాటకుండా 14 ఏళ్లు వనవాసం చేశాడు. పాండవులు.. జూదంలో ఓడిపోయి 12 అరణ్యవాసం, ఏడాది అజ్ఞాత వాసం చేశారు. కానీ అనంంతపురానికి చెందిన ఓ మహిళ.. వివాహం చేసుకున్నందుకు 13 ఏళ్లు బయటి ప్రపంచాయికి దూర మైంది. ఎన్నో ఆశలతో అత్తారింటికి వెళ్తున్నానని భావించిన ఆమె నరక కూపంలోకే వెళ్లింది. ఎట్టకేలకు కోర్టు, పోలీసులు, మహిళా సంఘాల జోక్యంతో ఎట్టకేలకు విముక్తి పొందింది. అనంతపురం జిల్లా పుట్టపర్తికి చెందిన సుప్రియ ఎంఏ ఇంగ్లిష్‌ చదివింది. ఆమెకు విజయనగరానికి చెందిన వ్యక్తితో 2008లో పెళ్లయింది. ఆమెకు ముగ్గురు పిల్లలు. పెళ్లయిన తర్వాత ఆమెకు 13 ఏళ్లలో కటి రెండుసార్లు మినహా బయటకు రాలేదు.

ఒక్కసారే పుట్టింటికి..
విజయనగరం నగరంలోని కంటోన్మెంట్‌ ప్రాంతానికి చెందిన మధుబాబు న్యాయవాది. ఈయనకు పుట్టపర్తి సత్యసాయి జిల్లాకు చెందిన జనార్దన్, హేమలత దంపతుల కుమార్తె సాయిసుప్రియతో 2008లో వివాహమైంది. సుప్రియ 2009లో ప్రసవానికి పుట్టింటికి వెళ్లారు. కుమార్తె పుట్టాక అత్తారింటికి వచ్చేశారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో సంబంధాలు లేకుండా, ఫోన్లో మాట్లాడనీయకుండా ఆమెను అడ్డుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు బాబులు పుట్టిన విషయాన్నీ తెలియనివ్వలేదు. సాయిసుప్రియను చూసేందుకు తల్లిదండ్రులు వచ్చినా మధుబాబు అడ్డుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా కుమార్తె ఎలా ఉందో తెలియక తండ్రి జనార్దన్‌ మంచం పట్టారు.

పని చేయడం మూలన కూర్చోవడం..
సుప్రియ ఉన్నత చదువులు చదివినప్పటికీ భర్తను, అత్తగారిని ఎదురించలేకపోయింది. ధైర్యం లేక గడప దాటే సాహసం కూడా చేయలేదు. పని చేయడం మూలన కూర్చోవడం మాత్రమే ఆమె దిన చర్యగా మారింది. ఇంట్లో ఉండి కూడా టీవీ చూడడం, ఫోన్‌ వాడడం లాంటివి కూడా లేదు. కేవలం పని చేయడమే ఆమె విధి.

పట్టణం ఎలా ఉంటుందో కూడా తెలియదు..
13 ఏళ్లుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేని సుప్రియకు తన పెళ్లి తర్వాత ఏం జరిగిందో కూడా తెలియదు. పట్టణం ఎలా మారింది. ఎలా అభివృద్ధి చెందింది కూడా తెలియదు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే 13 ఏళ్లుగా ఆమె సూర్యుడిని కూడా చూడలేదు.

పుట్టింటితో సంబంధం కట్‌..
పెళ్లయిన తర్వాత అత్తారింట అడుగు పెట్టిన సుప్రియకు పుట్టింటి వారితోనూ సంబంధాలు కట్‌ అయ్యాయి. తల్లిదండ్రులతో గానీ, అన్నదమ్ములతో గానీ మాట్లాడింది లేదు. పక్కింట్లో ఎవరు ఉంటున్నారు అనే విషయం కూడా ఆమెకు తెలియదు. బంధువులు, వేడుకలు, శుభకార్యాలకు వెళ్లిన సందర్భం లేదు. పిల్లలు పుట్టినప్పుడు మాత్రమే ఆస్పత్రికి వెళ్లింది. తర్వాత ఆస్పత్రికి వెళ్లింది కూడా లేదు. అనారోగ్యం వచ్చినా ఇంట్లోనే వైద్యం

Sadist Husband

కోర్టు ఆదేశంలో బయటకు..
13 ఏళ్లుగా తమ కూతురును చూడని తల్లిదండ్రులు అనేకమార్లు కలవడానికి ప్రయత్నించారు. కానీ, అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు గత నెల 27న హేమలత ‘స్పందన’లో ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
ఎస్పీ ఆదేశాలతో మధుబాబు ఇంటికి వన్‌టౌన్‌ పట్టణ పోలీసులు వెళ్లి ఆరా తీశారు. తమ ఇంటికి రావడానికి ఆదేశాలేమైనా ఉన్నాయా అని ప్రశ్నించడంతో వెనక్కి వచ్చేసిన పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయమూర్తి ఆదేశాలతో బుధవారం మధ్యాహ్నం సెర్చ్‌ వారెంట్‌తో సీఐ బి.వెంకటరావు, ఎస్సైలు, మహిళా పోలీసులు, వీఆర్వో, స్థానికులు ఆ ఇంటికి చేరారు. తలుపు తీయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకపోవడంతో బలవంతంగా లోపలికి వెళ్లారు. సుప్రియను తమ వెంట పంపించాలని కోరినా అంగీకరించకపోవడంతో బలవంతంగా ఆమెను తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ప్రస్తుతానికి ఆమెను తల్లిదండ్రులకు అప్పగించాలని, గురువారం రెండు కుటుంబాలను న్యాయ సేవాధికార సంస్థ(న్యాయస్థానం) ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి రమ్య తీర్పునిచ్చారని ఒకటో పట్టణ సీఐ బి.వెంకటరావు తెలిపారు.

13 ఏళ్లు ఎందుకు నిర్బంధించారనేది మాత్రం తెలియడం లేదు. కేవలం అత్తింటి మాట జవదాటొద్దని గడప దాటకుండా ఇంటికే పరిమితమైంది సుప్రియ.

Tags