Tata Harrier Rock Crash: ప్రపంచంలో కారును వినియోగించేవారు ఎక్కువే. అయితే చాలా మంది ఇప్పుడు SUVలకే మొగ్గు చూపుతున్నారు. కాస్త ఖరీదు ఎక్కువైనా సురక్షితంగా ప్రయాణించవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో SUV బ్రాండ్ పై వచ్చిన వెహికిల్స్ ఎక్కువగా అమ్మకాలు జరుపుకుంటున్నాయి. అయతే ప్రపంచంలోని ప్రసిద్ధి చెందిన కంపెనీలకు భారత్ కార్లు పోటీ నిస్తున్నాయి. ఇక్కడ తయారవుతున్న కార్లు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఆదరణ పొందుతున్నారు. వీటిలో ప్రధానం TATA కంపెనీ నుంచి వచ్చే కార్లు మరింత ఎక్కువ విక్రయాలు జరుపుకుంటున్నాయని చెప్పొచ్చు. ఈ కంపెనీ నుంచి రిలీజయ్యే కార్లు బండలాగా ధృఢంగా ఉంటుందని భావిస్తారు. ఎంత పెద్ద ప్రమాదం ఏర్పడినా ప్రయాణికులు సురక్షితంగా ఉంటారని కంపెనీ ప్రతినిధులు చెబుతూ ఉంటారు. అయితే వారు చెప్పేది అబద్ధం కాదని, అది నిజమేనని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కారు ఘాట్ రోడ్డుపై వెళ్తుంది. ఇందులో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో మహిళలు కూడా ప్రయాణిస్తున్నారు. నాగాలాండ్ లోని దిమాపూర్ జిల్లాలోనిదీ ప్రాంతం. వర్షాకాలం అయినందువల్ల ఇక్కడ వరదలు పారుతున్నాయి. దీంతో గుట్టలు కరుగుతున్నాయి. ఈ క్రమంలో చముకేడియా కొండప్రాంతంలో గుట్టలపై పెద్ద పెద్ద బండలు కిందికి పడుతున్నారు. ఈ సమయంలో అటునుంచి వెళ్తున్న ఓ కారుపై పిడుగులా పెద్ద బండ పడింది. దీంతో కారు నుజ్జు నుజ్జయింది.
ఈ పరిస్థితి చూస్తే ఎవరైనా పెద్ద ప్రమాదమే జరిగిందని భావిస్తారు. కానీ కొన్ని సెకన్లు గడిచిన తరువాత అందులోని కొందరు ప్రయాణికులు సురక్షితంగా బయటకు వచ్చారు. అంత పెద్ద బండ పడినా కారు నుజ్జనుజ్జయిన ప్రయాణికులకు ఎటువండి ప్రమాదం కాకపోయేసరికి అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ సంఘటనతో అక్కడంతా ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే అక్కడికి పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు. వర్షాకాలం అయినందువల్ల ఇక్కడి వాతావరణం ఆహ్లదకరంగా మారింది. దీంతో ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ప్రయాణికులు తరలివస్తున్నారు.
అయితే ఈ సందర్భంగా ఆసక్తి చర్చ సాగుతోంది. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ప్రయాణికులు సురక్షితంగా ఉండడానికి TATA కంపెనీ కారు మహిమే అని కొనియాడుతున్నారు. భారత్ నుంచి ఏ కారు ఉత్పత్తి అయినా బండలా ఉంటుదని, కారు డ్యామేజ్ అయినా ప్రయాణికులను సురక్షితంగా ఉంచుతుందని ఆటోమోబైల్ రంగంలో చర్చ సాగుతోంది. దీంతో భారత బ్రాండ్లే మిగతా వాటికంటే నాణ్యమైనవని అంటున్నారు.