https://oktelugu.com/

Spicejet Holi Dance: విమానంలో హోలీ సంబురాలు.. అమ్మాయిలతో స్పెప్పులు వేయించిన స్పైస్‌ జెట్‌.. వీడియో వైరల్‌!

హోలీ వేడుకలు శుక్రవారం(మార్చి 14న) దేశవ్యాప్తంగా అంబరాన్ని తాకాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హోలీ వేడుకల్లో(Holi Celabrations) పాల్గొన్నారు. రంగులు చల్లుకున్నారు.

Written By:
  • Ashish D
  • , Updated On : March 15, 2025 / 03:58 PM IST
    Spicejet Holi Dance

    Spicejet Holi Dance

    Follow us on

    Spicejet Holi Dance: మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో యువతీ యువకులు స్పెప్పులు వేయడం తరచూ చూస్తున్నాం. అధికారులు నిబంధనలు కఠినం చేసినా కొంత మంది వాటిని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. తాజాగా విమానం(Aeroplain)లో యువతులు స్టెప్పులు వేవారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

    Also Read: అసెంబ్లీకి కేవలం రెండుసార్లు మాత్రమే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు.

    హోలీ వేడుకలు శుక్రవారం(మార్చి 14న) దేశవ్యాప్తంగా అంబరాన్ని తాకాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హోలీ వేడుకల్లో(Holi Celabrations) పాల్గొన్నారు. రంగులు చల్లుకున్నారు. స్టెప్పులేశారు. ఇక ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌ జెట్‌(Spice jet) యాజమాన్యం కూడా ప్రయాణికులకు వినూత్నంగా స్వాగతం పలకాలని నిర్ణయించింది. ప్రయాణికులకు బొట్టుపెట్టి స్వాగతం పలికారు సిబ్బంది. తర్వాత యువతులు విమనాంలో డ్యాన్స్‌ చేసి ప్రయాణికులను అలరించే ప్రయత్నం చేశారు. దీనిని కొందరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో(Social Media) పోస్టు చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌ అవుతోంది. అయితే ఈ వినూత్న స్వాగతంపై విమాన ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ ఘటన సోషల్‌ మీడియాలో మిశ్రమ స్పందనలను రేకెత్తించింది. కొందరు దీనిని హోలీ స్ఫూర్తిని పంచే సరదా కార్యక్రమంగా ఆస్వాదించగా, మరికొందరు విమాన సేవల్లో ఇలాంటి చర్యలు అప్రొఫెషనల్‌గా ఉన్నాయని విమర్శించారు. స్పైస్‌జెట్‌ మాత్రం తమ వైఖరిని సమర్థిస్తూ, ఇది భద్రతా నిబంధనలకు విరుద్ధం కాదని, ప్రయాణికుల కోసం ఉద్దేశించిన సంతోషకరమైన క్షణంగా భావించాలని సూచించింది.

    స్పందించిన స్పైస్‌ జెట్‌..
    ‘ఈ హోలీ ఉత్సవం విమానం గాలిలో ఉన్న సమయంలో కాకుండా, గ్రౌండ్‌లో ఉన్నప్పుడు జరిగింది. అన్ని భద్రతా నిబంధనలు(Security Rules) మరియు ప్రమాణాలు కచ్చితంగా పాటించబడ్డాయి. మా సిబ్బంది ఈ నృత్య ప్రదర్శన ద్వారా ప్రయాణికులకు హోలీ సందర్భంగా వినోదాన్ని అందించడానికి ప్రయత్నించారు. ఇది మా సంస్థలో గతంలోనూ (2014 నుండి) హోలీ సందర్భంగా జరిగే ఒక సంప్రదాయంలో భాగం’ అని స్పైస్‌జెట్‌ తమ పోస్ట్‌లో పేర్కొంది. కొందరు నెటిజన్లు విమానం 5 గంటలు ఆలస్యమైందని వాదించినప్పటికీ, స్పైస్‌జెట్‌ ఈ వాదనను ఖండించలేదు కానీ దానికి ప్రత్యేకంగా స్పందించలేదు కూడా. సంస్థ తమ ఉద్దేశం ప్రయాణికులకు సంతోషాన్ని పంచడమేనని, ఇది ఒక సానుకూల ఉత్సవ భాగంగా చూడాలని కోరింది.

    Also Read: వైసీపీలో అధినేత మనసులో.. జనసేనలో ద్వితీయ శ్రేణి నేతలతో.. మాజీ మంత్రిపై వీడియో వైరల్!